విమానంలో ”బ్లాక్ బాక్స్” ఎందుకు పెడతారు..? బ్లాక్‌బాక్స్‌ వలన ఉపయోగం ఏమిటి..?

Ads

విమాన ప్రయాణం చేయడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. పైగా త్వరగా మనం గమ్యస్థానాన్ని చేరుకోవడానికి అవుతుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే విమానాలు ఎక్కువైపోతున్నాయి. అలానే విమాన ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదంలో ఏకంగా 72 మంది చనిపోయారు. అయితే విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ప్రధాన పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్.

విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ వలన ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలుస్తుంది. విచారణ అధికారులు ఈ బ్లాక్ బాక్స్ మీద ఆధారపడి ఉంటారు.

బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి..?

ఎయిర్ పోర్ట్ నుండి విమానం టేక్ ఆఫ్ అయినా తర్వాత నుండి కూడా అన్ని విషయాలు బ్లాక్ బాక్స్ లో రికార్డు అవుతాయి ప్రతి సంభాషణ కూడా రికార్డు అవుతుంది. విమాన పారామీటర్స్ కూడా ఎప్పటికప్పుడు దీనిలో రికార్డ్ అయి ఉంటాయి. ఒకవేళ కనుక విమాన ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ గురించి చూస్తారు దీని ఆధారంగానే దర్యాప్తు చేస్తారు. ఈ బ్లాక్ బాక్స్ వల్లనే అన్ని విషయాలు బయటపడతాయి. ఇన్ని విషయాలు ఈ బ్లాక్ బాక్స్ లో ఉంటాయి కాబట్టి ఏమైనా ప్రమాదం జరిగితే అధికారులు దీనిని చూస్తారు,

Ads

బ్లాక్ బాక్స్ ఎందుకు ఆరెంజ్ రంగులో ఉంటుంది..?

విమాన ప్రమాదం జరిగినప్పుడు అన్ని కాలిపోతాయి. ఆ బూడిద రంగుతో అన్ని కలిసిపోతాయి కనుక ఆరెంజ్ కలర్ ఉండడం వలన ఈజీగా గుర్తుపట్టొచ్చు. కాబట్టి ఆ రంగుని ఉపయోగిస్తారు. ప్రతికూల వాతావరణం లో కూడా స్ట్రాంగ్ గా ఉండడానికి దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రతని తట్టుకోగలదు. అలానే నీటిలో మునిగినా కూడా ఎటువంటి సమస్య కలగదు.

రాడర్ సిగ్నల్స్ అందకపోయినా సరే ఇది పనిచేస్తుంది. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుని దీనిని డిజైన్ చేస్తారు. ఈ బ్లాక్ బాక్స్ ని ఎప్పుడు కూడా వెనుక వైపునే అమరుస్తారు. ఇదే సురక్షితము. ఒకవేళ ఫ్లైట్ క్రష్ అయిపోయినా కూడా వెనక భాగం అలానే ఉంటుంది ధ్వంసం అవ్వదు. అందుకే వెనుక పెడతారు.

Previous articleఎన్టీఆర్, బాలకృష్ణ అప్పట్లోనే బాహుబలి వంటి మూవీలో నటించారు.. అయితే ఆ మూవీ ఎందుకు రిలీజ్ కాలేదో తెలుసా?
Next articleఆ చిన్న కారణంతో విరూపాక్ష లాంటి చిత్రాన్ని మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?