బస్సులో ప్రయాణించే సమయంలో కొందరికి వాంతులు అవుతుంటాయి. దానికి కారణం ఏమిటో తెలుసా?

Ads

సాధార‌ణంగా బస్సులో గానీ, కారులో గానీ, రైలులో గానీ ప్రయాణిస్తున్నప్పుడు కొంతమందికి తల తిరిగినట్టుగాను, కడుపులో తిప్పినట్టు, వికారంగా అనిపిస్తూ ఉంటుంది. దీని కారణంగా వారికి వాంతులు అవుతాయి. అయితే ఎక్కువగా బస్సులో ప్రయాణం చేసేటపుడు ఎక్కువగా ఇలా వాంతులు అవుతాయి.

Ads

పెద్దల దగ్గర నుండి చిన్న పిల్లల వరకు వాంతులు చేసుకుంటారు. అలా అనిపించినపుడు బస్సు ఆపమని చెప్పాలంటే మొహమాట పడి వాంతులొస్తే కిటికీలోంచే వాంతి చేసుకుంటూ ఉంటారు. చాలామందికి ప్రయాణాలు చేయడం ఇష్టం ఉన్నప్పటికి, బస్సు పడకపోవడంతో వాటిని విరమించుకుంటుంటారు. ఇంతకి బస్సులో ప్రయనించేటప్పుడు అసలు వాంతులు ఎందుకు అవుతాయనేది తెలుసుకుంటే, వాటితో ఇబ్బంది పడకుండా ప్రయాణం చేయవచ్చు.
ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రయాణం చేసేటపుడు ప్రతీ ముగ్గురిలోనూ ఒకరు వాంతులు చేసుకుంటారని పరిశోధనలు ద్వారా తెలుస్తోంది. అయితే కొందరికి మాత్రం బస్సు ఎక్కగానే వాంతులు అవుతాయి. మరికొందరికి కొద్ది దూరం ప్రయాణించిన తరువాత వాంతులు అవుతాయి. కొంతమందికి బస్సులోని వాసన పడనపుడు వాంతులు అవుతాయి. ఈ విషయంలో మగవారితో పోల్చుకుంటే మహిళలకే ఎక్కువగా వాంతులు అవుతాయి. ఇకపోతే మగవారికైనా, ఆడవారికైనా ప్రయాణిస్తున్నప్పుడు తల తిరుగుతున్నట్లుగా ఉండడం, వికారంగా, వాంతులు కావడం వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. ఇక ప్రయాణంలో వాంతులు చేసుకోవడాన్ని మోషన్ సిక్నెస్ అని అంటారు. బస్సు కదలికలు అనేవి ప్రయాణించే వారి శరీర అవయవాలను డిస్టర్బ్ చేస్తుంది. అది కుదుపుల వల్ల లేదా వేగంగా వెళ్లడం వల్ల, బస్సులోని వాసనల వల్ల వాంతులు అవుతాయి.అయితే ప్రయాణం చేసేటప్పుడు మిగతా వారికి లేని వికారం, వాంతులు కొందరికే ఎందుకు వస్తాయన్న ప్రశ్న వస్తుంది. దీనికి రీజన్ చెవి లోపల ల్యాబిరన్ థైటిస్ అనే పార్ట్ ఇన్ఫెక్షన్ కి వచ్చినపుడు వికారం, వాంతులు వస్తాయి. అయితే మరికొన్ని సందర్భాల్లో చెవుడు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి చెవుల్లోకి వెళ్ళడం వల్లనే ల్యాబిరన్ థైటిస్ పై ఒత్తిడి ఏర్పడుతుంది. అలాంటప్పుడు వికారం, వాంతులు అవుతాయి. దానివల్లే ప్రయాణాల్లో కొంతమంది చెవులలో కాటన్ పెట్టుకుంటారు. మరొక కారణం ఏమిటంటే ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవుతాయేమో అని ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా వాంతులు అవుతాయి. అంతేకాకుండా ప్రయాణం చేయడానికి ముందు ఆయిల్ ఫుడ్ తినడం కారణంగా, తినగానే ప్రయాణం చేసినా, బస్సులో ప్రయాణంచేటపుడు తినడం వల్ల వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది.వాంతులు కాకుండా ఉండాలంటే కొంతమంది నిమ్మకాయ వాసన చూస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల వికారం తగ్గుతుంది. అందులో ఉండే ఎసిడిక్ యాసిడ్స్ వికారం నుండి ఉపశమనం కలిగిస్తాయి. వాంతులు అవుతాయేమో అనే భయాన్ని మనసులో నుండి తీసివేయాలి. ఇంకా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం చేస్తుంటే వాంతులు అవుతాయన్న ఫీలింగ్ నే మర్చిపోతాం. వీలయితే నిద్రపోవడం, కళ్ళు మూసుకోవాలి. మంచి నీళ్లు తాగుతూ ఉండాలి. కూల్ డ్రింక్ లుఅవాయిడ్ చేస్తేనే మంచిది. ఆకలిగా అనిపిస్తే కొంచెం కొంచెంగా తినాలి. మ్యూజిక్ వినడం వల్ల కూడా ఆలోచనలను పక్కన పెట్టవచ్చు. అల్లం మిఠాయిలు, పుల్లని చాక్లెట్లు తినడం వల్ల కూడా వికారం, వాంతులు తగ్గుతాయి.
Also Read: విమానంలో ప్రయాణించే వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో తెలుసా?

Previous articleUSTAAD MOVIE REVIEW : శ్రీ సింహ హీరోగా నటించిన ఉస్తాద్ మూవీ హిట్టా..? ఫట్టా..?
Next articleఎన్టీఆర్, బాలకృష్ణ అప్పట్లోనే బాహుబలి వంటి మూవీలో నటించారు.. అయితే ఆ మూవీ ఎందుకు రిలీజ్ కాలేదో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.