నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలోని పింకీ ప్రస్తుతం ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

Ads

విజయభాస్కర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాని మరో రెండు, మూడు దశాబ్డల వరకు కూడా మర్చిపోలేరని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఈ సినిమాలో త్రివిక్రమ్ అందించిన మాటలు, వెంకీ కామెడీ మాములుగా ఉండదు.

ఇప్పటికి టెలివిజన్ లో ఈ సినిమా ప్రసారం అయినప్పుడల్లా మంచి టిఆర్.పి ని వస్తూనే ఉంది. ఇక ఈ చిత్రంలోని లో ప్రతీ క్యారెక్టర్ కూడా ఆడియెన్స్ గుర్తుండిపోయింది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ క్రమంలో ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల తరువాత గుర్తుండి పోయే పాత్ర పింకీ.

ఎందుకంటే పింకీ పాత్రకి హీరో హీరోయిన్లతో సమానంగా స్క్రీన్ టైం దక్కింది. ఆ క్యారెక్టర్ చేసిన నటి పేరు సుదీప. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా రిలీజ్ తరువాత సుదీప పింకీగా మారిపోయింది. ఈ సినిమా తరువాత పింకీ బొమ్మరిల్లు, బిందాస్, స్టాలిన్, మిస్టర్ పర్ఫెక్ట్, లెజెండ్ లాంటి సినిమాలలో నటించింది. సినిమాలలోనే కాకుండా బుల్లితెర సీరియల్స్ లో నటించి, టెలివిజన్ ప్రేక్షకులను అలరించింది.
పింకీ ఎంబిఎ వరకు చదువుకుంది. ఆ తరువాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకుని హైదరాబాద్ లో స్థిరపడింది. ఆమె భర్త పేరు శ్రీరంగనాథన్. పెళ్లి తరువాత సుదీప ఇండస్ట్రీకి దూరంగానే ఉంటోంది. అయితే బిగ్‌బాస్ సీజన్‌ 6 కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో ఉన్నది కొన్ని రోజులే అయినా తనదైన శైలిలో ఆకట్టుకుంది. ఆమె ప్రస్తుతం క్లాసికల్ డాన్స్ స్కూల్ ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో సుదీప లేటెస్ట్ ఫోటోలు షికారు చేస్తున్నాయి. ఈ ఫోటోస్ లో పింకీ తన అందంతో ఆకట్టుకుంటోంది. మరి మళ్ళీ వెండి తెరపై కనిపిస్తుందో చూడాలి.

Ads

Also Read: “అమిగోస్” మూవీ రివ్యూ.. కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?

Previous articleఅజ్ఞాతవాసి చిత్రంలో పవన్‌ కళ్యాణ్ మెడలో ధరించిన లాకెట్‌ గురించి తెలుసా?
Next article”కాంతారా” సినిమాలో శివ ఆఖరున ఎందుకు కనపడకుండా వెళ్ళిపోతాడు..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.