అజ్ఞాతవాసి చిత్రంలో పవన్‌ కళ్యాణ్ మెడలో ధరించిన లాకెట్‌ గురించి తెలుసా?

Ads

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన సినిమా అజ్ఞాతవాసి. ఈ చిత్రం పవన్‌ కళ్యాణ్ సినీ కెరీర్‌లో డిజాస్టర్‌ సినిమాలలో ఒకటి. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్‌ అనగానే ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Ads

అప్పట్లో ఈ కాంబో పై చాలా క్రేజ్‌ ఉండేది. కానీ సినిమా విడుదల అయిన తరువాత అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. దాని ఫలితంగా బాక్సాఫీస్‌ దగ్గర ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ హీరోయిన్స్ గా నటించారు. సీనియార్ హీరోయిన్ కుష్బూ కీలకమైన పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్ కోటీశ్వరుడైన వ్యక్తికి కుమారుడిగా నటించాడు.
కాగా ఈ చిత్రంలో పవన్ ఒక లాకెట్‌ ధరించారు కదా. సినిమా చూసినవారికి గుర్తుండే ఉంటుంది. ఆ లాకెట్ ఒక లాకర్‌ను తెరవడానికి ఉపయోగపడుతుంది. అయితే పవన్ ధరించిన ఆ లాకెట్‌ మీద ఆంజనేయుడు ప్రతిమ ఉంటుంది. ఇక ఆ ఆంజనేయుడు ప్రతిమ అచ్చం రామ్‌ చరణ్‌ మొదలుపెట్టిన కొణిదెల ప్రొడక్షన్‌ లోగోలోని ఆంజనేయ స్వామి ప్రతిమను పోలి ఉంటుంది. అయితే ఆ లాకెట్ అందరిని ఆకర్షించింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.ఆ లాకెట్ ను పవన్ మధ్య విభేదాలు లేవని తెలిపేందుకే ధరించారు. ఈ విషయాన్ని అజ్ఞాతవాసి ఈవెంట్ లో స్వయంగా పవన్‌ కళ్యాణ్ చెప్పారు. ఆ తరువాతి రోజుల్లో అనేక పరిణామాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడం, రాజకీయాల్లో కొనసాగుతూ, మరో వైపు సినిమాలలో నటిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు, పవన్‌ కళ్యాణ్ జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్‌తో క్లోజ్ గా ఉండడంతో మెగా ఫ్యాన్స్‌ కు ఆ విషయం నచ్చడం లేదు.

Also Read: SHIVA VEDHA REVIEW : ”శివ వేద” సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్…!

Previous articleఈ స్థాయికి రావడానికి.. ”ప్రభాస్” ఇంత కష్టపడ్డాడా..?
Next articleనువ్వు నాకు నచ్చావ్ చిత్రంలోని పింకీ ప్రస్తుతం ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.