ఆ ఒక్క విషయంలో సావిత్రి పట్టిన పంతమే ఆమె పాలిటి శాపం అయ్యిందా..

Ads

మహానటి సావిత్రి గురించి తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాక్టర్ గా తన సత్తాని చాటి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలు చేరుకున్న హీరోయిన్ సావిత్రి. ఆన్ స్క్రీన్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా నిజంగా సావిత్రి ఒక గొప్ప ఆదర్శవంతమైన మహిళ. ఆమె చేతితో సాయం పొందిన ఎందరో ఈరోజుకు ఆమెను ఎంతో గొప్పగా తలుచుకుంటారు.

అయితే అడిగిన వారికి లేదు అనకుండా పెట్టడం మాత్రమే తెలిసిన సావిత్రి ఆ తరువాత జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తిన్నారు. ఆమెకు సినీ ఇండస్ట్రీలో బాగా కలిసి వచ్చింది కానీ నిజజీవితంలో మాత్రం పెళ్లి జరిగిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమిళ్లో సావిత్రి ఆమె భర్త అయిన జెమినీ గణేషన్తో కలిసి నటించిన ఎన్నో చిత్రాలు ఊహించని విధంగా విఫలమయ్యాయి.

Ads

సొంతంగా ఇద్దరూ కలిసి నిర్మించినటువంటి చిత్రాలకు బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం సావిత్రిని ఫైనాన్షియల్ గా కాస్త దెబ్బతీసింది. దీనికి తోడు జెమినీ గణేషన్ కు వేరే నటితో పరిచయం ఆమెతో సాగిన ఎఫైర్ కారణంగా సావిత్రి సంసారంలో పెద్ద సునామీయే మొదలైంది. ఈ నేపథ్యంలో భర్త మీద కోపంతో సావిత్రి తీసిన చిన్నారి పాపలు అనే సినిమా ఆమెను పూర్తిగా ఆర్థికంగా నష్టపోయేలా చేసింది. ఇదే సమయంలో ఆమెపై ఐటి శాఖ దాడి కూడా జరిగింది.

ఒకపక్క ముందుగానే డబ్బులు తీసుకున్న నటీనటులు సహకరించక సినిమా లేట్ అవుతుంటే మరో పక్క జరిగిన ఐటీ దాడి కారణంగా సావిత్రి మానసికంగా కృంగిపోయారు. ఈ ఒక్క చిత్రం తీయాలి అని సావిత్రి పట్టు పట్టకుండా ఉంటే ఆమె పరిస్థితి వేరుగా ఉండేది అని సినీవర్గంలో ఇప్పటికీ అనుకుంటారు. కష్టాల కడలిలో మద్యాన్ని ఆసరాగా చేసుకున్న సావిత్రి తరువాత తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాయి కొంతకాలం మంచంలోనే గడిపి తుది శ్వాస విడిచారు.

Previous articleఆ చిన్న కారణంతో విరూపాక్ష లాంటి చిత్రాన్ని మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
Next articleటెస్టు క్రికెట్‌ ఆడే సమయంలో ఆటగాళ్లు తెలుపు రంగు జెర్సీలనే ఎందుకు ధరిస్తున్నారు?