ఆ చిన్న కారణంతో విరూపాక్ష లాంటి చిత్రాన్ని మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

Ads

సాయి ధరమ్ తేజ లాంటి యావరేజ్ హీరో రేంజ్కి ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఊహించని విధంగా అంచనాలకు మించి వసూలు రాబెట్టడంతో పాటు ఇందులో నటించిన హీరో హీరోయిన్స్ కి చక్కటి క్రేజ్ తెచ్చిన చిత్రం ఇది అని చెప్పవచ్చు. ఆద్యంతం థ్రిల్లింగ్ సీన్స్ తో సాగే ఈ హారర్ చిత్రం ప్రేక్షకులను రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది. ఈ మూవీ విపరీతమైన లాభాలు అందించడంతో ప్రస్తుతం నడుస్తున్న సీక్వెల్ ట్రెండ్ ని ఈ చిత్ర బృందం కూడా ఫాలో కాబోతున్నారు.

విరూపాక్ష మూవీలో సాయిధరమ్ తేజ నటించిన హీరోయిన్ పాత్రలో సంయుక్తా మీనన్ నటించారు. ఎంతో అమాయకమైన పిల్లగా నటిస్తూ మరో పక్క ఎవరికీ తెలియకుండా ఊరినే రూపు లేకుండా చేయడానికి స్కెచ్ వేసే వ్యక్తిగా సంయుక్త అద్భుతంగా నటించారు. మరి ముఖ్యంగా చేతబడి చేసే సీన్లో సంయుక్తను చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.

Ads

అయితే మొదట ఈ క్యారెక్టర్ కి సంయుక్త బదులు హీరోయిన్గా సాయి పల్లవి అని అనుకున్నారట. ఎందుకంటే అభినయ ప్రధానమైన పాత్రలలో సాయి పల్లవి నటన ఎంత న్యాచురల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ అయితే మంచి సక్సెస్ వస్తుంది అని మేకర్స్ భావించారు. కానీ సాయి ధరమ్ తేజ పక్కన సాయి పల్లవి నటిస్తే ఖచ్చితంగా అతన్ని డామినేట్ చేసే ఛాన్స్ ఎక్కువ అని మేకర్స్ భావించారట.

ఈ ఒక్క రీజన్ వల్ల సాయి పల్లవి ప్లేస్ లో సంయుక్త ఎంట్రీ ఇచ్చింది. అయితే రాబోయే విరూపాక్ష సీక్వెల్ మూవీలో సాయి పల్లవి నటిస్తే బాగుంటుంది అని నటిజన్లో తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తీకరిస్తున్నారు. సీక్వెల్ మూవీ కాబట్టి విరూపాక్ష ఫస్ట్ పార్ట్ కంటే కూడా అది మరింత థ్రిల్లింగ్ గా రావాలి.. పైగా మొదటి సినిమా సక్సెస్ అయింది కాబట్టి రెండవ పార్ట్ పై అంచనాలు భారీగా ఉంటాయి. మరి ఈ మూవీ విషయంలో మేకర్స్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Previous articleవిమానంలో ”బ్లాక్ బాక్స్” ఎందుకు పెడతారు..? బ్లాక్‌బాక్స్‌ వలన ఉపయోగం ఏమిటి..?
Next articleఆ ఒక్క విషయంలో సావిత్రి పట్టిన పంతమే ఆమె పాలిటి శాపం అయ్యిందా..