Ads
పాండవుల గురించి ద్రౌపది గురించి మనం ఎన్నో విషయాలను విని ఉంటాం. ద్రౌపతి దృపదరాజ కూతురు. ద్రుపద రాజు పాంచాలి దేశాన్ని పాలించేవారు. ద్రౌపతి ని అర్జునుడు పెళ్లి చేసుకుంటాడు. మత్స్య యంత్రాన్ని అర్జునుడు చేదించి ద్రౌపదిని వివాహం చేసుకున్న విషయం మనకి తెలిసిందే. ఆ తర్వాత పాండవులంతా కూడా ఆమె ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం చూస్తే..
పెళ్లి చేసుకున్నాక ద్రౌపది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో సంవత్సరం ఉండేదని ఉంది. ఇది నిజమా కాదా అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం.
నారదుడు పండవులని కలిసినప్పుడు సందుడు, ఉపసందుల కథ చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఆ కథ ఏమిటంటే.. సందుడు, ఉపసందుడు వీళ్లిద్దరు కూడా కవలలు. రాక్షస జాతికి చెందినవారు వీళ్ళు. ఓ వరం వీళ్లకు ఉంటుంది. దీనితో ఎవరూ కూడా వీళ్ళను చంపలేరు. అయితే వీళ్ళు మాత్రం ఒకరికొకరు చంపుకోచ్చు. ఈ వరం వలన సర్వలోకాలకు వెళ్లి వీళ్లిద్దరు హింసించడం మొదలుపెట్టారు. దీనితో ఓ ఉపాయం ఆలోచించి దేవతలు ఆ ఇద్దరి దగ్గరకి తిలోత్తమను పంపుతారు.
Ads
ఆమె కోసం ఇద్దరూ ఒకరిని ఒకరు చంపుకుంటారు. ఈ కధనే నారదుడు పాండవులకు చెప్పడం జరిగింది. ఈ స్థితి రాకూడదని నియమం పెట్టుకోండి అని నారదుడు చెబుతాడు. ద్రౌపది ఒకరి దగ్గర ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఆమె దగ్గరకి రాకూడదని… ఓ సారి అర్జునుడు ఒక బ్రాహ్మణుడికి సాయం చెయ్యాలని ధర్మరాజు దగ్గరకి విల్లమ్ముల కోసం వెళ్తాడు. అక్కడ ద్రౌపది ఉంటుంది. ద్రౌపది ఒకరి దగ్గర ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఆమె దగ్గరకి రాకూడదని నియమం వుంది కదా.. దాన్ని తప్పడం తో అర్జునుడు 12 ఏళ్ల పాటు అరణ్యవాసం చేయడం జరుగుతుంది.