ఇదేందయ్యా ఇది…భార్యాభర్తలు కలవడానికి కూడా “షెడ్యూల్” పెట్టుకుంటారు అంట.?

Ads

బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకొణెల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ దంపతులు ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరో హీరోయిన్లుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. దీంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోవడానికి సమయాన్ని షెడ్యూల్ చూసుకుంటున్నారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది దీపికా పదుకొనే. ఈ సందర్బంగా ఇంటర్వ్యూలో భాగంగా దీపికా మాట్లాడుతూ..

Ads

నా భర్తతో సమయం గడపడం నాకు చాలా ముఖ్యం. కానీ, మా ఇద్దరికీ అంత సమయం ఉండదు. ఇద్దరం వృత్తి పరంగా చాలా బిజీగా ఉంటాము. కొన్ని సార్లు నెల రోజుల పాటు షూటింగ్‌ కోసం ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంటుంది. లేదంటే ఆయన చిత్రీకరణ అయిపోయి ఇంటికి వచ్చే సమయానికి నేను షూటింగ్‌కు వెళ్లాల్సి రావచ్చు. అర్ధరాత్రి, తెల్లవారు జామున ఇలా ఎప్పుడంటే అప్పుడు షూటింగ్‌ల కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే మేము కలిసి గడపాల్సిన సమయాన్ని కూడా షెడ్యూల్‌ చేసుకుంటాము. అలా ఎంత సమయం గడిపామన్నది ముఖ్యం కాదు.

గడిపిన కొంత సమయాన్ని ఎంత ఎంజాయ్‌ చేశామనేది ముఖ్యం. మేమిద్దరం ఏకాంతంగా ఉండే సమయాన్ని ఎంత ఇష్టపడతానో, మా కుటుంబాలతో గడపడాన్ని కూడా అంతే ఇష్టపడతాను అని చెప్పుకొచ్చింది దీపికా. డ్యాన్స్‌ అంటే మాకు చాలా ఇష్టం. వారాంతాల్లో కొన్నిసార్లు నేను, రణ్‌వీర్‌ కలిసి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు డ్యాన్స్‌ చేస్తాం అని దీపికా పదుకొణె తెలిపింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వ్యాఖ్యలపై నెటిజన్లు అభిమానులు ఫన్నీగా స్పందిస్తున్నారు.

Previous articleచిరంజీవి కొరియోగ్రఫీ చేసిన ఈ పాట ఏదో తెలుసా..? ఏ సినిమాలోది అంటే..?
Next articleపెద్ద వయసు ఉన్న వాళ్ళనే అమ్మాయిలు కోరుకుంటున్నారు.. వాళ్లలో అమ్మాయిలని ఆకర్షించే 5 లక్షణాలు ఇవే.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.