Ads
విమానంలో ప్రయాణించడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. పైగా తక్కువ సమయం లోనే మనం దూర ప్రాంతాలకి వెళ్లడానికి అవుతుంది. అయితే మనం విమానం లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని వస్తువులను తీసుకు వెళ్లద్దని అంటూ ఉంటారు. పైగా విమానం ఎక్కే ముందు చెకింగ్ వంటివి కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విమాన ప్రయాణం చేసినప్పుడు సెల్ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేయమని ఎయిర్ హోస్టర్స్ చెప్తూ ఉంటారు.
అలానే అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. అయితే మరి ఎందుకు ఇలా చెబుతారు..? విమానంలో ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్స్ ని ఎందుకు స్విచ్ ఆఫ్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
Ads
విమానం ఎగురుతున్నప్పుడు మళ్ళీ నేల మీదకి దిగుతున్నప్పుడు ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయమని అంటుంటారు. లేదంటే ఎరోప్లేన్ మోడ్ లో పెట్టమని అంటూ వుంటారు. అసలు ఎందుకు ఇలా చెబుతూ వుంటారు..? దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏమిటి అనేది చూసేద్దాం. విమానం లో ట్రావెల్ చేసినప్పుడు ఫోన్ ని వాడినా టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో మాత్రం ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేయమంటారు. ఎందుకనేది చూస్తే.. భద్రత కారణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప అధికారికంగా నిషేధించలేదు.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దీని కోసమే మీ చెప్పలేదు. కానీ ప్లైట్ అటెండెంట్స్ మాత్రం ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చెయ్యమంటారు. ఎందుకంటే సెల్ ఫోన్స్ విడుదల చేసే రేడియో తరంగాలే దీనికి కారణం. సెల్ ఫోన్స్ నుండి వచ్చేవి ప్లేన్ నుండి వచ్చేవి ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఈ కారణంగా కాక్ పిట్ లో ఉండే ఏరోనాటికల్ వ్యవస్థకు ఇబ్బంది వచ్చి అంతరాయం కలిగించవచ్చు. ఇది ప్రమాదానికి కారణం అయ్యే ఛాన్స్ వుంది. ముఖ్యంగా విమానం ఎత్తుకు వెళ్ళినపుడు ఎక్కువ మెుత్తంలో సిగ్నల్స్ ని పంపిస్తుంది. ఈ కారణంగా సిగ్నల్స్ ట్రాఫిక్ అవుతుంది. అంతరాయం రావచ్చు.