LAMBASINGI REVIEW : బిగ్ బాస్ “దివి” హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించిన దివి, ఆ తర్వాత బిగ్ బాస్ ప్రోగ్రాం ద్వారా గుర్తింపు సంపాదించుకున్నారు. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. ఇప్పుడు లంబసింగి అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

  • చిత్రం: లంబసింగి
  • నటీనటులు: భరత్ రాజ్, దివి వడ్త్యా, కిట్టయ్య, జనార్దన్.
  • దర్శకుడు: నవీన్ గాంధీ
  • సంగీతం: ఆర్ ఆర్ ధ్రువన్
  • నిర్మాత : ఆనంద్ తన్నీరు
  • రిలీజ్ డేట్ : మార్చి 15, 2024

కథ:

వీరబాబు (భరత్ రాజ్) కి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చి, మొదటి పోస్టింగ్ లంబసింగిలో పడుతుంది. అక్కడ నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరబాబు ఊరికి వెళ్ళిన మొదటి రోజు హరిత (దివి) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కోనప్ప అనే ఒక వ్యక్తి కూతురు. గతంలో నక్సలైట్ అయిన కోనప్ప, ఆ తర్వాత సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. హరిత ఆ ఊరిలో ఉండే ఒక హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తూ ఉంటుంది. ఒకరోజు వీరబాబు హరితని ప్రపోజ్ చేస్తే, హరిత రిజెక్ట్ చేస్తుంది.

వీరబాబు అదే బాధలో పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అయితే, ఆరోజు పోలీస్ స్టేషన్ మీద నక్సలైట్లు దాడి చేస్తారు. ఆ దాడిలో వీరబాబు గాయపడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరబాబుకి తెలిసిన ఆ విషయం ఏంటి? హరిత వీరబాబు ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేసింది? ఆ తర్వాత వీరబాబు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

Ads

ఒకపక్క ప్రేమ కథ నడుస్తూనే, మరొక పక్క పోలీసులు – నక్సలైట్లకి మధ్య ఘర్షణ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడం అనేది ఏదైనా ఒక సినిమాలో చాలా ముఖ్యమైన విషయం. ఈ సినిమాలో దర్శకుడు అలానే రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేశారు. దర్శకుడు ఎంచుకున్న స్టోరీ పాయింట్ ని తెర మీద చాలా బాగా చూపించారు. సినిమా మొదట్లో కాస్త స్లోగా ఉన్నా కూడా, ఆ తర్వాత మాత్రం వేగం పెరుగుతుంది. సంగీత దర్శకుడు ధ్రువన్ అందించిన పాటలు కూడా బాగున్నాయి.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు. వీరబాబు పాత్రలో భరత్ రాజ్ బాగా నటించారు. సాధారణంగా హీరోయిన్స్ పాత్రకి చాలా సినిమాల్లో ప్రాముఖ్యత తక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. దివికి చాలా మంచి పాత్ర లభించింది. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలో దివి నటించారు. ఆమె పాత్రని రూపొందించిన విధానం కూడా బాగుంది. వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ కథని కూడా ఎక్కడా ఎబ్బెట్టుగా లేకుండా చూపించారు. అలా అని సినిమా ట్రాక్ తప్పకుండా, మరొక పక్క కోర్ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చాలా బాగా చూపించారు.

ప్లస్ పాయింట్స్:

  • స్టోరీ పాయింట్
  • పెర్ఫార్మెన్స్
  • పాటలు
  • ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • స్లోగా స్టార్ట్ అయ్యే ఫస్ట్ హాఫ్
  • ల్యాగ్ గా అనిపించే కొన్ని సీన్స్

రేటింగ్:

3/5

ఫైనల్ గా:

ఒక మంచి ప్రేమ కథతో పాటు, ఎమోషన్స్ కూడా ఉన్న ఒక లవ్ స్టోరీగా లంబసింగి సినిమా నిలుస్తుంది.

watch trailer : 

Previous articleవిమానంలో ప్రయాణించేటప్పుడు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చెయ్యాలి..?
Next articleహిట్ టాక్ వచ్చినా కూడా… ఈ 4 సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి..!