పుష్ప సినిమాలో ”తగ్గేదెలే” డైలాగ్ వెనుక కథ ఇదే..!

Ads

బన్నీ ఫ్యాన్స్ అంతా కూడా పుష్ప టు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పుష్ప మొదటి పార్ట్ 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ క్రేజ్ ని మరింత పెంచేసింది. బన్నీ పక్కన రష్మిక మందన నటించిన ఆకట్టుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అన్న విషయం మనకి తెలుసు. ఇప్పుడు ఇక అందరూ దృష్టి రెండవ పార్ట్ మీద పడింది. రెండో పార్ట్ ఎలా ఉంటుందా అని అంతా చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా గురించి అప్డేట్స్ అయితే వచ్చేసాయి. అల్లు అర్జున్ లేడీ గెటప్ లో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ షికార్లు కొట్టాయి. వేర్ ఈజ్ పుష్ప అని వచ్చిన వీడియో కూడా అందరిని ఆకట్టుకుంది అయితే ఈ సినిమాలో చూస్తే పుష్ప కనపడకపోవడంతో జనం అంతా ఆందోళన చెందడానికి చూపించారు. చిత్తూరు జిల్లా మొత్తం అట్టడుగుపోతుంది.

Ads

పిల్లల కోసం పుష్ప చేసిన సహాయం.. గుండె ఆపరేషన్ల కోసం ఖర్చు చేయడం వీటన్నిటిని కూడా రెండవ పార్ట్ లో చూపించారని అర్ధం అవుతోంది. పైగా పుష్ప బతకాలని జనం అంతా కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పుష్ప రెండో పార్ట్ లో వుంటాయని అర్ధం అవుతోంది. అయితే తగ్గేదిలే డైలాగ్ బాగా పాపులర్ అయింది. అయితే అసలు ఈ డైలాగ్ వెనక కథ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సుకుమార్ మరియు చిత్ర యూనిట్ పుష్ప పాత్రకి తగ్గట్టు ఏదైనా ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉండాలని అనుకున్నారు.

మొదట ఎన్నో డైలాగ్స్ ని అనుకున్నారు వెనకడుగు వేయకూడదు, తలదించకూడదు వంటి డైలాగ్ లు మొదట అనుకున్నారు. ఫైనల్ గా ఈ డైలాగ్ ని పెట్టారు. తగ్గేదేలే డైలాగ్ బాగా పాపులర్ అయింది. గ్లోబల్ వైడ్ గా కూడా ఇది బాగా పాపులర్ అయిపోయింది. ఒక ఫైట్ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ తన గడ్డాన్ని సవరించుకుంటున్నారు. డైరెక్టర్ సుకుమార్ దాన్ని గమనించి దీన్ని ఇంప్రూవ్ చేద్దామని చెప్పారట. ఇలా ఈ డైలాగ్ వెలుగులోకి వచ్చింది.

Previous articleవారానికి ఏడూ రోజులే ఎందుకు ఉంటాయి? దాని వెనకున్న స్టోరీ ఇదేనా ?
Next articleతెలుగు సినిమా కాన్సెప్ట్ తో వచ్చిన… ఆ హాలీవుడ్ సినిమా గురించి మీరు విన్నారా..?