వారానికి ఏడూ రోజులే ఎందుకు ఉంటాయి? దాని వెనకున్న స్టోరీ ఇదేనా ?

Ads

మనకి వారానికి ఏడు రోజులు ఉంటాయి. ఏడు రోజులులో కూడా ప్రతి ఒక్కరూ వివిధ రకాల పనులతో బిజీ బిజీ ఉంటారు వారానికి కేవలం ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది. అదే ఆదివారం నాడు. ఆదివారం నాడు ఎంతో రిలాక్స్ గా ఉంటుంది సరదాగా ఎక్కడికైనా వెళ్లాలంటే ఆదివారం నాడే వెళ్లేందుకు అవుతుంది మిగిలిన ఆరు రోజులు కూడా ఎవరి పనితో వాళ్ళు బిజీ ఉంటారు. నిజానికి ఆదివారం వచ్చిందంటే చాలు ఎంతో హుషారుగా ఆనందంగా ఉంటుంది కానీ మళ్ళీ సోమవారం నాడు పనికి వెళ్లాలంటే ఏదో ఇబ్బందిగా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది.

మళ్ళీ వారం అంతా ఎప్పుడు పూర్తవుతుందా? ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు అయితే వారానికి ఏడు రోజుల ఎందుకు ఉండాలి..? ఎనిమిది రోజులు కానీ పది రోజులు కానీ లేకపోతే మూడు రోజులే ఉండొచ్చు కదా.. వారానికి ఎందుకు ఏడు రోజులే ఉండాలి దాని వెనుక కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

నిజానికి వారానికి ఎన్ని రోజులు ఉండాలి అనేది చాలామంది అధ్యయనం చేశారు. సూర్యుడు, గ్రహాలు, చంద్రులు కదలిక ఆధారంగా ఎన్నో నిర్ణయాలని తీసుకున్నారు. పూర్వం బాబిలోన్ ఖగోళ గణనలలో చాలా నైపుణ్యం అభివృద్ధి కలిగి ఉండేవాళ్లు. వారానికి ఏడు రోజులు అనే కాన్సెప్ట్ ముందు వాళ్లే తీసుకొచ్చారని తెలుస్తోంది. గ్రహాలు కదలిక నుంచి ఏడు రోజుల్ని వారంగా తీసుకున్నారు. 28 రోజుల కక్ష ఆధారంగా ఏడు రోజుల నాలుగు వారాలు తయారు చేయడం జరిగింది. ఆ కాలంలో ఈజిప్ట్, రోమ్ లో వారం 8 కానీ 10 రోజులు కానీ ఉండేది ఇక మన ఇండియా గురించి చూస్తే అలెగ్జాండర్ భారతదేశంలో గ్రీకు సంస్కృతిని తీసుకువచ్చారు.

ఏడు రోజులను వారంగా భారతదేశానికి వ్యాప్తి చేశారు అని చరిత్రకారులు అంటారు. తర్వాత చైనా కూడా ఏడు రోజులని వారంగా తీసుకొచ్చిందట. ఇలా ఏడు రోజులకి పేర్లు పెట్టారు. రోమ్ లో ఈ విషయం గురించి ఎన్నో ప్రయోగాలు కూడా జరిగాయి. ఇస్లాం జుడాయిజం వారైతే వారానికి ఒకరోజు ప్రార్థన కోసం వారంలో ఏడు రోజులని తీసుకొచ్చారు. కానీ మిగిలిన వాళ్ళు ఆరు రోజుల పనిచేసి ఒకరోజు మతపరమైన పనుల కోసం కేటాయించడానికి ఇలా ప్రారంభించారు. ఒక గ్రహానికి ఒక్క రోజున కేటాయించారు. శని,చంద్రుడు, కుజుడు, బుధుడు, గురు, శుక్రుడు ఇలా పేర్లు పెట్టారు అవి ప్రస్తుతం ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారాలుగా మారాయి.

Previous articleనాగార్జున తో నాగేశ్వర రావు అంత స్ట్రిక్ట్ గా ఉండేవారా..?
Next articleపుష్ప సినిమాలో ”తగ్గేదెలే” డైలాగ్ వెనుక కథ ఇదే..!