Ads
పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండటం. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం. కానీ ఈ పెళ్లి అనే ఒక విషయంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. అవన్నీ కూడా ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఆ ఇద్దరు వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. అవన్నీ ఎంత దూరం వెళ్తాయి అనేది వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. అయితే, సాధారణంగా ఏదైనా ఒక రిలేషన్ షిప్ లో ఒకరి నుండి ఒకరు కొన్ని లక్షణాలని ఆశిస్తారు. అమ్మాయిలు కూడా తమకి కాబోయే భర్త నుండి కొన్ని లక్షణాలు ఆశిస్తారు. అలాంటి లక్షణాలు ఉండాలి అనుకుంటారు. ఉంటేనే పెళ్లి వరకు వెళ్లాలి అని ఆలోచిస్తారు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 గౌరవం ఇవ్వడం. సాధారణంగానే, మనిషికి గౌరవం ఇవ్వడం అనేది ఏ మనిషిలో అయినా సరే ఉండాల్సిన లక్షణం. పెళ్లయ్యాక కూడా, భార్య అనే ఒక చిన్న చూపు లేకుండా భార్య మాటలకి, వాళ్ల అభిప్రాయాలకు కూడా గౌరవం ఇవ్వాలి అని చాలా మంది అమ్మాయిలు ఆశిస్తారు.
#2 మద్దతు ఇవ్వడం. కొన్ని సార్లు ఇంట్లో గొడవలు అవుతాయి. బయట నుండి వచ్చిన అమ్మాయి కాబట్టి భార్యని బయట అమ్మాయిలాగా అనుకోకుండా మద్దతు ఇవ్వాలి అని చాలా మంది అమ్మాయిలు ఆశిస్తారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కూడా అందరి ముందు అవమానించకుండా ఉండాలి అని అనుకుంటారు.
Ads
#3 ఆర్థిక స్వాతంత్రం. ఒకవేళ భార్య ఉద్యోగం చేస్తూ ఉంటే, అందుకు భర్త పనులు షేర్ చేసుకోవడం వంటివి చేయాలి. భార్య ఉద్యోగానికి వెళ్లడానికి ప్రోత్సహించాలి. ఒకవేళ భార్య ఉద్యోగం చేయకపోతే, తన నిర్ణయాన్ని గౌరవించి, భర్త భార్యకి వ్యక్తిగత ఖర్చులకి కూడా కొంత డబ్బు ఇవ్వాలి. వారి ఇష్టాలని కూడా వారి భర్తలు అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు.
#4 అహంకారం చూపించడం అనేది ఎవరు ఇష్టపడరు. ఇలాంటి బంధాల్లో కూడా గొడవలు అయినప్పుడు అహంకారం చూపించకుండా ప్రవర్తించాలి అని చాలా మంది భార్యలు అనుకుంటారు. అంతే కాకుండా, ఇంటి పనుల్లో కూడా వారికి సహాయం చేయాలి అని అనుకుంటారు.
#5 ఒక బంధం నిలబడాలి అంటే మానసికంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకరు ఏదైనా విషయంలో ఫీల్ అయితే, వాళ్ల బాధని కొట్టి పడేయకుండా, దాని అర్థం చేసుకొని, వారు ఎలా చేస్తే తమ భాగస్వామికి బాధ తగ్గుతుంది అనే విషయాన్ని ఆలోచించాలి. ఒకవేళ అవతలి వాళ్ళు మానసికంగా బలహీనంగా ఉంటే, వారికి బలం ఇవ్వడానికి ప్రయత్నించాలి. చాలా మంది భార్యలు కూడా తమ భర్తల నుండి ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటారు. తమ ఆలోచనలను అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు.
ఇవన్నీ ఒక వ్యక్తిలో కనిపిస్తేనే ఒక అమ్మాయి పెళ్లి వరకు ఆలోచిస్తుంది. ఈ విషయాలు అన్నీ కూడా ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి పరిగణలోకి తీసుకుంటుంది అని పరిశోధకులు చెప్తున్నారు.
ALSO READ : అందరి మనసులు గెలిచి… లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు..! ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?