Ads
గతంలో బాలనటులుగా పలు చిత్రాలలో నటించి, మెప్పించిన వారు చాలామంది పెద్దయ్యాక హీరో హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వారిలో చాలామంది ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
అలా గతంలో రచ్చ సినిమాలో బాలనటిగా తమన్నా చిన్నప్పటి పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో? ఆమె ఇప్పుడు ఎలా ఉందో? ఏం చేస్తుందో? ఇప్పుడు చూద్దాం..
‘ఆరెంజ్’ డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో నటించిన మూవీ రచ్చ. 2012లో రిలీజ్ అయిన ఈ మూవీ తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుని, కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో హీరోయిన్ గా తమన్నా నటించింది. తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించిన అమ్మాయి పేరు విషిక లక్ష్మణ్. ఆమె ‘సగిలేటి కథ’ అనే మూవీతో హీరోయిన్ గా మారింది. అంతే కాకుండా ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే మరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విషిక లక్ష్మణ్ మాట్లాడుతూ, బాలనటిగా రచ్చ మూవినే చివరి సినిమా అని, అంతకు ముందు అనేక సినిమాలలో బాలనటిగా నటించనట్టుగా చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా మారక ముందు విషికా బుల్లితెర సీరియల్స్ లో నటించింది. ఈటీవీలో ప్రసారం అయిన యమలీల ఆ తర్వాత, సీతా సమేత రామ అనే రెండు తెలుగు సీరియల్స్‌లో నటించింది. యూట్యూబ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించింది.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన విషిక లక్ష్మణ్, ప్రస్తుతం హైదరాబాద్‌లోని అనీష్ కాలేజీలో బికామ్ కంప్యూటర్స్ చదువుతోంది. విషిక లక్ష్మణ్ హీరోయిన్ గా నటిస్తున్న సగిలేటి కథ మూవీలో రవి మహాదాస్యం హీరోగా నటిస్తున్నారు. రాయలసీమ గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీని రాజశేఖర్ సుద్మూన్ తెరకెక్కించారు. నవదీప్ సి స్పేస్ సమర్పణలో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ రావడం విశేషం.
Also Read: అన్ని రోజులు కలిసి ఉండాల్సిన హౌస్ మేట్స్ తో… ఇలా అబద్ధం చెప్తే ఎలా శివాజీ..?