అన్ని రోజులు కలిసి ఉండాల్సిన హౌస్ మేట్స్ తో… ఇలా అబద్ధం చెప్తే ఎలా శివాజీ..?

Ads

హీరో శివాజీ తన పర్సనల్ లైఫ్ గురించి బిగ్ బాస్ స్టేజిపై ఒకలాగా మాట్లాడి తీరా ఇంట్లోకి వెళ్ళాక మరొక రకంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో అసలు విషయం ఏమిటి? శివాజీ మాటల్లో నిజం ఎంత ఉంది అని ప్రేక్షకులు ఎటూ తేల్చుకోలేని అయోమయ స్థితిలో పడిపోయారు.

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభంలో కంటెస్టెంట్స్ అందరూ ఓ ఆత్మీయత వలకబోశారు.. మరి ఎవరు ఎలాంటి వారు అనేది ఒక రెండు మూడు ఎపిసోడ్లు పడితే కదా తెలిసేది.

comments on shivaji bigg boss telugu 7

వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో కాస్త ఒకప్పుడు హీరోగా పాపులారిటీ ఉన్న హౌస్ మేట్ శివాజీ. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ఆ తర్వాత క్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించడం మొదలుపెట్టాడు . అవకాశాలు మరీ తగ్గిపోవడంతో గత కొద్ది కాలంగా సినిమా నుంచి అదృష్టం అయ్యాడు. మరోపక్క రాజకీయ నాయకుడిగా కాకపోయినా కాస్త రాజకీయాలపై ఆసక్తి ఉన్న వ్యక్తిగా, రాజకీయ విశ్లేషకుడిగా అప్పుడప్పుడు హడావిడి చేస్తూ ఉంటాడు.

comments on shivaji bigg boss telugu 7

Ads

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం రోజున నాగార్జునతో స్టేజిపై తన భార్య పేరు శ్వేత అని చెప్పిన శివాజీ…హీరో హౌస్ లోకి ఎంటర్ అయ్యాక.. తాను సింగిల్ అని చెప్తున్నాడు. ఒక ఇంటర్వ్యూలో మీది లవ్ మ్యారేజా ?లేక అరేంజ్డ్ మ్యారేజా? అని ప్రశ్నించినప్పుడు ఓ పెళ్లిలో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని శివాజీ చెప్పడం జరిగింది. అప్పట్లో తాను యాక్టర్ అవడంతో బయట తిరగడం కాస్త కష్టంగా ఉండేదని…అందుకే పెళ్లిలో చూసి ఇష్టపడిన అమ్మాయిని నేరుగా పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.

comments on shivaji bigg boss telugu 7

టేస్టీ తేజ శివాజీని పెళ్లి గురించి అడిగినప్పుడు తనకు ఎవరూ పిల్లని ఇవ్వలేదు కాబట్టి పెళ్లి కాలేదు అని ఎంతో కాజువల్ గా సమాధానం ఇచ్చాడు. మరి హౌస్ లోకి ఎంటర్ అయ్యాక అందమైన అమ్మాయిలను చూసి మతి చెల్లించిందా.. మనసు అదుపు తప్పిందా తెలియదు కానీ మొత్తం మీద సంసారి కాస్త బ్రహ్మచారి అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.

ALSO READ : 2 ఏళ్లుగా వెంటబడి బిగ్ బాస్ హౌస్ లోకి…”పల్లవి” అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే.?

Previous article43 ఏళ్లు వచ్చినా…. ఒకప్పటి హీరోయిన్ “కౌసల్య” ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా?
Next articleఅసలు “AP స్కిల్ డెవలప్‌మెంట్ కరప్షన్ కేసు” అంటే ఏంటి..? చంద్రబాబు నాయుడుని ఈ విషయంలో ఎందుకు అరెస్ట్ చేసారు..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.