“గుప్పెడంత మనసు” సీరియల్ మీద ఫైర్ అవుతున్న ఆడియెన్స్..! విషయం ఏంటంటే..?

Ads

స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‍ మొదట్లో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని టాప్ రేటింగ్ తో దూసుకుపోయింది. రిషి, వసుధార, జగతి, మహేంద్ర వంటి క్యారెక్టర్లు బుల్లితెర ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Ads

కానీ గత కొన్నిరోజులుగా ప్రసారం అవుతున్న సీరియల్ ను చూసి గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. రిషిధారల వ్యక్తిత్వాన్ని చంపకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బుల్లితెర పై ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని సినిమాలు, విభిన్న కార్యక్రమాలు ఎన్ని వచ్చినా సీరియల్స్ స్థానం ఎప్పుడు పదిలంగా ఉంటుంది. అలా ఇప్పటివరకు ఎన్నో సీరియల్స్ సక్సెస్ ఫుల్ గా సంవత్సరాల తరబడి ప్రసారం అవుతున్నాయి. అలా టాప్ రేటింగ్ లో నిలిచిన సీరియల్ గుప్పెడంత మనసు. స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఒకప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్న కార్తీకదీపం సీరియల్ తో పోటీపడి టాప్ రేంజ్ లో దూసుకుపోయింది. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ పరిస్థితి దారుణంగా ఉంది.
గాడి తప్పిన స్టోరీతో గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకాదరణ కోల్పోయింది. టీఆర్పీ రేటింగ్ లో కనీసం  టాప్ టెన్ లో కూడా గుప్పెడంత మనసు చోటు సంపాదించుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం కథలో పట్టు కోల్పోవడం, ఒకప్పుడు రిషి, వసుధార ప్రేమకథతో పాటు, రిషి, జగతి మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ తో మంచి కథతో ఆడియెన్స్ ఆకట్టుకున్న ఈ సీరియల్. కొన్నిరోజులుగా వసుధార పాత్రను మారుస్తూ వచ్చారు.
ఈ విషయం ఆడియెన్స్ కి నచ్చడం లేదు. ఇపుడు హీరో రిషి క్యారెక్టర్ ను కూడా మారుస్తున్నారు. దాంతో హీరో రోల్ ని ఆ సీరియల్ దర్శకుడే చంపేస్తున్నారు అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్ ఒక పాయింట్ మీద ప్రారంభం అయ్యి, గాడి తప్పిన కథతో ఎటో పోయింది. సీరియల్ చాలా గందరగోళం అయిందని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: అన్ని రోజులు కలిసి ఉండాల్సిన హౌస్ మేట్స్ తో… ఇలా అబద్ధం చెప్తే ఎలా శివాజీ..?

Previous article“బాధ చెప్పుకోవడానికి వచ్చాను..!” అంటూ… అరెస్ట్‌పై స్పందించిన చంద్రబాబు నాయుడు భార్య..! ఏం అన్నారంటే..?
Next article“రచ్చ” మూవీలో చిన్నప్పటి తమన్నాగా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.