Ads
భారతదేశంలోనే అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అయినా రైల్వే నెట్వర్క్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద నెట్వర్క్ గా ర్యాంకు పొందింది. ఎంతోమంది రైల్వేస్ ను నేటికీ కూడా తమ ప్రధాన ట్రాన్స్పోర్ట్ సాధనంగా వాడుతున్నారు. మంచి ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు వినూత్నమైన పథకాలను ప్రవేశ పెడుతూనే ఉంటారు. అయితే ఈ క్రమంలో వారు నియమించిన నిబంధనలు కొన్ని ప్రయాణికులను ఇబ్బంది పెడతాయి. మరి అలాంటి ఒక నిబంధన గురించే ఈ రోజు తెలుసుకుందాం.
రైల్వే టైం ప్రకారం రాత్రి 10 నుంచి ఉదయం 6:00 వరకు నిద్ర వేళలుగా నిర్దేశించడమైనది. ఇదే విషయాన్ని ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికులకు అధికారికంగా తెలియజేయడం కూడా జరిగింది. అంతేకాదు ఈ నిబంధనను పాటించడంలో ఎవరైనా విఫలమైతే వారికి తగు జరిమానా కూడా విధించవలసిందిగా నివేదికల్లో సూచించారు. అంతేకాకుండా మీ నిర్ణీత స్టేషన్లో ట్రైన్ ఎక్కిన తర్వాత ప్రయాణికులు మొదటి రెండు స్టేషన్స్ దాటే లోపు తన సేటును ఆక్రమించడంలో విఫలమైతే, ఆ
సీటును మరొక వ్యక్తికి కేటాయించే అవకాశం కూడా ఉంది
Ads
అయితే ఈ నిబంధన కారణంగా రైల్లో ప్రయాణికుల కదలిక పరిమితం అయ్యే అవకాశం ఉంది. సీటు ఆక్రమించడానికి ఇచ్చినటువంటి సమయం కేవలం పది నిమిషాలకు మించి లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి లోనవుతారు. ఏదన్నా అవసరం కలిగినప్పుడు ప్రయాణికులు తమ సీట్లు తాత్కాలికంగా వదిలి వెళ్ళడం కూడా అసాధారణం అవుతుంది.అయితే కొన్ని సందర్భాలలో రైలు సమయం ఆలస్యమైనప్పుడు ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి సొంత ఖర్చుతో బస్సు లేదా క్యాబ్ లాంటి ప్రత్యామ్నాయ రవాణాను ఏర్పాటు చేసుకుంటాం.ఈ నేపథ్యంలో రైల్వే విధిస్తున్నటువంటి ఈ విధివిధానాల పై పలువురు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.