రజినీకాంత్ మాస్ మాఫియా షురూ…ఇరగదీస్తున్న జైలర్ చిత్రం.

Ads

గత కొద్ది కాలంగా ” ఆ ‘నువు కావాలయ్యా.. నువు కావాలయ్యా.. దా…దా..”అంటూ తమన్నా సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతుంటే.. మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు…. అర్థమయిందా రాజా…అంటూ రజిని తన ట్రేడ్ మార్క్ పంచ్ తో జైలర్ చిత్రం హైపును అమాంతం పెంచేశారు.కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించినటువంటి జైలర్ చిత్రం ఈరోజు భారీ లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పటినుంచో భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం మరి ఈ రోజు ప్రేక్షకులను ఎలా మెప్పించిందో తెలుసుకుందాం

సినిమా: జైలర్
నటీనటులు : రజినీకాంత్, రమ్యకృష్ణ,తమన్నా, ప్రియాంకా అరుళ్ మోహన్,శివరాజ్‌కుమార్‌,మోహన్ లాల్,సునీల్ తదితరులు.
దర్శకుడు: నెల్సన్ దిలీప్ కుమార్‌
సంగీతం : అనిరుధ్ రవిచందర్
నిర్మాత : కళానిధి మారన్‌

స్టోరీ:

టైగర్ ముత్తువేల్ పాండియన్ ఒక భిన్న అభిప్రాయాలు కలిగినటువంటి ఎంతో స్ట్రిక్ట్ జైలర్. ఖైదీలను క్రమశిక్షణలో ఉంచడం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ముత్తువేల్ వెనకాడరు. తాను జైలర్ గా ఉన్న జైలు నుంచి తప్పించుకుంటున్న ఒక గ్యాంగ్ స్టార్ ని జైలర్ అడ్డుకుంటారు. తామ అనుకున్నది జరగకపోవడంతో ఆ గ్యాంగ్స్టర్ యొక్క ముఠా జైలర్ పై పగబడుతుంది.

రిటైర్మెంట్ తర్వాత తన కుటుంబంతో ఎంతో హ్యాపీగా గడుపుతున్న జైలర్ జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ గ్యాంగ్స్టర్ ముఠా పాండియన్ కుటుంబంలో పెద్ద అలజడిని సృష్టిస్తారు. దీని కారణంగా ముత్తువేల్‌లో మరొక రూపం బయటకు వస్తుంది. అప్పటివరకు ఫ్యామిలీ మెన్ గా ఒక స్ట్రిక్ట్ జైలర్ గా ఉన్న ముత్తువేల్‌ క్రూరమైన వ్యక్తిగా మారుతాడు. అసలు అతను మారడానికి వెనక ఏం జరిగింది? గ్యాంగ్ కారణంగా పాండియన్ కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది ఎదురయ్యింది? తెలుసుకోవాలంటే స్క్రీన్ పై చిత్రాన్ని చూడాల్సిందే…

Ads

రివ్యూ:

ఫ్యామిలీ మూమెంట్స్ చక్కగా ఉండడంతో చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. మరీ ముఖ్యంగా రజనీకాంత్ ,రమ్యకృష్ణ ఈ చిత్రంలో వైఫ్ అండ్ హస్బెండ్ గా నటించడం మూవీకి ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన నరసింహ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 24 ఏళ్ల క్రితం వచ్చిన చిత్రంలో రజనీకాంత్ ఇష్టపడిన వ్యక్తిగా రమ్యకృష్ణ నటించిన తప్ప అతన్ని ఆ మూవీలో మ్యారేజ్ చేసుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ కూడా నెట్ లో బాగా ట్రోల్ అవుతుంది.ఇక తమన్నా సాంగ్ కోసమైనా కచ్చితంగా ఈ మూవీకి వెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. జైలర్ గా రజినీకాంత్ ఈ వయసులో కూడా తనకు ఎవరూ సాటి లేరు అని మరోసారి నిరూపించారు. కథ కాస్త రోటీన్ అనిపించినా అక్కడ ఉన్నది రజిని కాబట్టి కథనం స్మూత్ గా సాగింది. సినిమా ఇంట్లో మరియు కామెడీ సీన్స్ అలాగే కొన్ని డైలాగ్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. రజనీకాంత్ ను ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో చూడవచ్చు.. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి.

ప్లస్ పాయింట్స్:

రజినీకాంత్ అప్పియరెన్స్ ,మేనరిజం హాలీవుడ్ స్టార్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది.

ఎలివేషన్స్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది.

రమ్యకృష్ణ యాక్షన్ మూవీ లో హైలెట్.

ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ మూవీని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తుంది.

రజనీకాంత్ ఫైటింగ్స్ థియేటర్లో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్:

కథ కాస్త రోటింగా అనిపిస్తుంది కానీ ఒన్స్ మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యాక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

రజనీకాంత్ రంగంలోకి దిగేంతవరకు మూవీ చాలా స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తుంది.

రేటింగ్  3.5/5

Previous articleఅక్కినేని కటుంబంలోని వారి పేర్ల‌కు ముందు ‘నాగ’ అని ఉండడానికి వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా?
Next articleమీరు టికెట్టు తీసుకున్న సరే పొరపాటున ఇలా చేస్తే మాత్రం ట్రైన్లో ఫైన్ కట్టాల్సిందే..