Ads
గతంలో కంటే ఈ మధ్యకాలంలో తెలుగులోనే కాకుండా సినిమాలు ఏ భాషలో వచ్చిన వాటిలో వచ్చే కాపీ సీన్స్ పైన చర్చ ఎక్కువగా జరుగుతూ ఉంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దాదాపు అందరికి అందుబాటులోకి వచ్చాయి. సినిమా భాష తెలియకున్న, సబ్ టైటిల్స్ పెట్టుకుని చూసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దానివల్ల అన్ని భాషల సినిమాలు చూస్తుండడంతో కాపీ సీన్స్ ఏమిటో తెలిసిపోతున్నాయి.
అది మాత్రమే కాక అరచేతిలోనే సోషల్ మీడియా ఉండడంతో వీటిపై చర్చ ఎక్కువగానే జరుగుతోంది. ఇక స్టార్ హీరోల చిత్రాలు సూపర్ హిట్ అయినపుడు కొందరు పనికట్టుకుని మరి ఆ సినిమాలోని లోపాలను వెతుకుతున్నారు. ఇది తెలుగులో కొందరు డైరెక్టర్స్ చిత్రాల విషయంలో ఎక్కువగా కనిపిస్తోంది. వీరిలో త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలను లోతుగా చూసి కాపీ సీన్స్ అని కొందరు సామాజిక మధ్యమాలలో పోస్ట్ లు చేస్తున్నారు. అలాంటిదే ఇప్పుడు ఒకటి నెట్టింట్లో షికారు చేస్తోంది. మరి అది ఏమిటో చూద్దాం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తున్న ఆ సన్నివేశం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు మూవీలోనిది. రవితాజా నటించిన విక్రమార్కుడు చిత్రంలో రౌడీ కుమారుడుకి పిచ్చి అని కోర్టు తీర్పును ఇస్తుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశంలో వారు ఇంట్లో రాత్రి సమయంలో పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ పార్టీకి మినిస్టర్, అతనికి సెక్యూరిటీ ఆఫీసర్ గా విక్రమ్ రాథోడ్ వెళ్తాడు. ఇక రౌడీ కొడుకు అక్కడున్న పోలీస్ లతో ఒక ఆట ఆడతాడు. చివరగా ఆ ఆట విక్రమ్ రాథోడ్ వరకు రావడంతో, తన దగరికి పరుగెత్తుకుంటూ రౌడీ వస్తున్నప్పుడు బుల్లెట్స్ ను కిందకి విసురుతాడు.బుల్లెట్స్ మీద కాలు వేయగానే రౌడీ కాలుజారీ కిందపడి చనిపోతాడు. ఈ సన్నివేశం ఆ మూవీకి హైలెట్ గా నిలిచింది. అయితే ఈ సీన్ ని విజయశాంతి మూవీ నుండి కాపీ చేసిన సన్నివేశం అనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై జక్కన వివరణ ఇచ్చారు.
Ads
ఇది శాంభవి ఐపిఎస్ అనే మూవీలోని సీన్ అని, ఆ సన్నివేశం నచ్చడంతో తన సినిమా కోసం తీసుకున్నానని చెప్పారు. అయితే శాంభవి ఐపిఎస్ సినిమాకు రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.
Also Read: దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ చేసిన సినిమాలలో ఆయన భార్యకు నచ్చని సినిమా ఏమిటో తెలుసా?