పూర్వ కాలంలో రాజులు కోట క‌ట్టేట‌ప్పుడు ఈ 5 టెక్నిక్స్ ఉపయోగించేవారు.. అవి ఏమిటో తెలుసా?

Ads

యుద్ధం చేయాలంటే ప్రస్తుతం అన్ని దేశాల దగ్గర అత్యాధునికమైన యుద్ధ పరికరాలు, ఆయుధాలు, పవర్ ఫుల్ మిస్సైల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే పూర్వ కాలంలో అంటే రాజులు పాలించే కాలంలో వారికి కత్తులు, విల్లులు, గొడ్డళ్లు, బల్లెం లాంటి ఆయుధాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. వారు వాటినే యుద్ధంలో ఉపయోగించేవారు.

అయితే యుద్ధం జరిగినపుడు దానిలో శత్రువులు గెలిచి, కోటను ముట్టడించే సందర్భం వచ్చినపుడు, ఆ సమయంలో వారి నుండి తప్పించుకోవడం కోసం రాజులు కొన్ని ఏర్పాట్లు చేసుకునే వారు. దానివల్ల వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. మరి అవి ఏమిటో చూద్దాం..
1. దృఢంగా ఉండే గేట్లు:
రాజ కోటలకు ఉండేటువంటి ప్రధాన ద్వారాలకు చాలా దృఢమైన గేట్లను అమర్చేవారు. అవి ఎంత దృఢంగా ఉండేవీ అంటే ఏనుగులు ఢీకొట్టినా సరే చెక్కు చెదరకుండా ఉండేవి. అంతేకాకుండా ఆ గేట్లకు పదునైన మేకులను పెట్టేవారు. ఆ గేట్లను ఒకవేళ ఏనుగులు ఢీకొడితే మేకులు అవి గుచ్చుకుని మరణించేవి. ఈ రకంగా శత్రువుల దాడి నుండి కొంత మేర తప్పించుకునే అవకాశం ఉంటుంది.

2. ఎత్తైన భారీ గోడ:
రాజులలో కొందరు తమ కోటలను శత్రువులు తేలికగా పడగొట్టకుండా ఉండడం కోసం ప్రధాన ద్వారం చుట్టూ కూడా ప్రహరీ గోడను చాలా ఎత్తుగా, భారీగా నిర్మించేవారు. అలాంటి కోట జోధ్‌పూర్‌లో ఉంది. ఎత్తైన భారీ గోడను ఏనుగులు తేలిగ్గా బద్దలు కొట్టలేవు.ఒకవేళ కొట్టినా కూడా కోట లోపలికి వెళ్ళడం కొంచెం ఆలస్యమవుతుంది. ఆ సమయంలో లోపల ఉన్నవారు తప్పించుకోవడానికి కాస్త సమయం ఉంటుంది.

Ads

3. మరిగే నూనె:
ఇక మరో టెక్నిక్ ఏమిటి అంటే కోట చుట్టూ ఉండే ఇరుకైన, లోతైన మార్గాల్లో దాక్కొని ఉన్న శత్రువులను అంతం చేయడం కోసం పై నుంచి వారు ఉన్నదగ్గర మరిగే నీటిని కానీ,మరిగే నూనెను కానీ పోసేవారు. ఇక వేడిని తట్టుకోలేక వారు అక్కడే చనిపోయారంట.

4. సొరంగ మార్గాలు:
ఇక సొరంగ మార్గాల్లో దాక్కొని ఉన్న శత్రు సైనికులను సంహరించడానికి విషపూరితమైన గాలులను వదిలేవారట. దానికోసం సొరంగ మార్గం దారులన్నిటిని ముందుగా మూసివేసేవారు. అంతేకాకుండా ఈటెలను విసిరి శత్రువులను చంపేవారట.

5. ఇరుకైన మార్గాలు:
కోటలు లోపల, బయట తిరగడానికి చాలా వరకు ఇరుకైన మార్గాలు ఉంటాయి. మలుపులు తిరుగుతూ, ఎగువ దిగువగా ఉండే మెట్ల మార్గాలు ఉంటాయి. వీటి వల్ల కోట లోపలికి శత్రువులు ప్రవేశించినా నెమ్మదిగా నడవాల్సి ఉంటుంది. ఒకేసారి ఎక్కువమంది ఆ మార్గాల్లో వెళ్ళడానికి కుదరదు.ఇక వీటిని దాటుకుని శత్రువులు లోపలికి రావడానికి సమయం ఎక్కువగా పడుతుంది. వారు వచ్చేసరికి కోట లోపల ఉన్నవారు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.

Also Read: ”జోధ్ పూర్” లో ఎక్కువ ఇల్లులన్నీ నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి.. కారణం ఏమిటంటే..?

Previous articleస్టార్స్ కి తమ వాయిస్ ఇచ్చిన 11 పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి తెలుసా?
Next articleవిక్రమార్కుడు మూవీలోని ఆ సన్నివేశాన్ని జక్కన కాపీ చేసారా? (Video)
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.