రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పత్రిక చూసారా..? ఇందులో ఏం రాసి ఉంది అంటే..?

Ads

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వార్తలతో ఈ మధ్య పెళ్లి వార్తలతో నెట్టింట సందడి చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో  లో కొన్నేళ్ల వరకు స్టార్ హీరోయిన్ గా రాణించిన రకుల్ టాప్ హీరోలందరితోనూ నటించింది. తక్కువ  సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమెకు ఆ తరువాత తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.

బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించినా అంతగా కలిసి రాలేదు. అయితే ఆమె బాలీవుడ్ యాక్టర్ జాకీ భగ్నానీని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. తాజాగా రకుల్ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ గత రెండున్నర ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. 2021 అక్టోబర్‌లో ఈ జంట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ ప్రేమను  ప్రకటించిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులు రిలేషన్ లో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారు.

గత కొన్ని రోజుల నుండి వీరి వివాహ వేడుక గోవాలో జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 21న గోవాలో రకుల్, జాకీ పెళ్లి వేడుక గ్రాండ్ గా జరగనుందని తెలుస్తోంది. అయితే పెళ్ళికి సమయం దగ్గర పడుతుండడంతో రకుల్ పెళ్లి ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉంది. పెళ్లి షాపింగ్స్ కోసం రకుల్ వెరైటీగా ఆటోలో ప్రయాణించింది. రకుల్ ఆటోలో వెళ్ళిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.తాజాగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ పెళ్లి ఇన్విటేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ఫస్ట్ పేజీ పింక్ మరియు బ్లూ రంగుల కలయికతో ఉంది. బ్లూ మరియు వైట్  కుషన్‌లతో అలంకరించబడిన తెల్లటి సోఫాతో అందంగా డిజైన్ చేయబడింది. బ్లూ కలర్ డోర్ అందమైన బీచ్‌కి దారి చూపినట్టుగా ఉంది. సెకండ్ పేజీలో రాజ మండపం సెటప్‌తో, ‘ఫెరస్ బుధవారం 21 ఫిబ్రవరి 2024’ అని ఉంది.  ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక నెట్టింట్లో వైరల్ గా మారింది.

Also Read: ఈ ఫోటోలో ఉన్న జ్యోతిష్యుడు ఎవరో గుర్తుపట్టారా…?

 

Previous articleహనుమాన్ సినిమాలో హీరోయిన్‌లో ఇది VFX చేసారా..? దీని అవసరం ఏం ఉంది..?
Next articleగుంటూరు కారం మూవీలోని ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.