గుంటూరు కారం మూవీలోని ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనియా ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మదర్ సెంటిమెంట్ తో తెరక్కేకింది.

జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర వందకోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. డైరెక్టర్ త్రివిక్రమ్ పై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. తాజాగా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీలోని ఒక సీన్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షీ చౌదరి నటించిన లేటస్ట్ మూవీ గుంటూరు కారం. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మ్యాజిక్ లేదని ఆడియెన్స్ కామెంట్స్ చేయగా, మహేశ్ పెర్ఫామెన్స్ అదిరిపోయిందని అన్నారు. మహేశ్ డ్యాన్స్ బాగా చేశారని, విశ్వరూపం చూపించారని తెలిపారు. టాక్‌ తో సంబంధం లేకుండా సూపర్ స్టార్ మేనియాతో ఈ సినిమా వసూళ్లు భారీగా వచ్చాయి. అయితే మేకర్స్ రిలీజ్ అయిన నెలరోజుల్లోపు గుంటూరు కారం మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చారు.
థియేటర్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం ఓటీటీలో దున్నేస్తుంది. ఈ మూవీ ఫిబ్రవరి 9న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది. ఆ రోజు నుండి ఓటీటీ ప్రేక్షకులు గుంటూరు కారంకు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఇండియా చార్టులో టాప్ ప్లేస్ కి చేరుకుంది. నంబర్ 1 లో తెలుగు వెర్షన్ ఉండగా, 3వ స్థానంలో హిందీ, 5వ ప్లేస్‌లో తమిళ వెర్షన్‌ దూసుకుపోతుంది. దీంతో సూయపర స్టార్ అభిమానులు సంతోష పడుతున్నారు.
అయితే తాజాగా మీమ్స్_ రాయుడు అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో గుంటూరుకారం మూవీలోని ఒక సీన్ ను షేర్ చేసి, గమనించారా? అని క్యాప్షన్ ఇచ్చారు. అందులో మహేష్ ఒక వ్యక్తి తల పై కొట్టగా, అతను కిందపడతాడు. అప్పుడు మహేష్ అగ్గిపెట్టతో అతని తల పై అని సిగరెట్ వెలిగిస్తాడు. అప్పుడు దెబ్బలు తిన్న వ్యక్తి నవ్వుతూ కనిపించాడు. ‘తల పగలకోడితే నవ్వుతావెంటి బ్రో’ అంటూ బ్రహ్మనందం మీమ్ ని కూడా యాడ్ చేశారు. దీనిపై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  మనవరాలిగా చేసిన “శ్రీదేవి” మీపక్కన హీరోయిన్ అనేసరికి “ఎన్టీఆర్” ఏమన్నారో తెలుసా.?

Previous articleరకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పత్రిక చూసారా..? ఇందులో ఏం రాసి ఉంది అంటే..?
Next article24 ఏళ్ళ వయసులో సీనియర్ ఎన్టీఆర్, జగ్గయ్య గారికి రాసిన ఈ లెటర్ చూశారా..? ఇందులో ఏం రాశారు అంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.