Ads
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి నిన్న ఘనంగా జరిగింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్, నటుడు జాకీ భగ్నాని తో, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి జరిగింది.
వీరిద్దరూ గత 3 సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టినరోజు నాడు 2021 లో తన రిలేషన్ షిప్ గురించి ప్రకటించారు.
ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చాలా చోట్ల కనిపించారు. దాంతో రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అనే వార్త రావడం మొదలు అయ్యింది. కానీ అవన్నీ కూడా పుకార్లు అని, దానికి ఇంకా సమయం ఉంది అని రకుల్ చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు కూడా అలాంటి వార్త వచ్చింది. కానీ ఇది కూడా నిజమా కాదా అని చాలా మందికి తెలియలేదు. నిన్న సడన్ గా సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి ఫోటోలని పోస్ట్ చేసి, ఈ వార్తని షేర్ చేసుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. పంజాబీ-సింధీ పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది.
Ads
వీరి పెళ్లి గోవాలో జరిగింది. ఐటీసీ గ్రాండ్ గోవా రిసార్ట్ అండ్ స్పా లో వీరి పెళ్లి జరిగింది. ఇందులో ఒక్కొక్క రూమ్ కి ఖర్చు కూడా బాగానే అయ్యింది. ఇందులో సాధారణ రూమ్ ఒక్క రోజుకి 22,000 కాస్ట్ పడుతుంది. అదే మంచి లగ్జరీ సూట్ రూమ్ అయితే 86,000 ధర ఉంటుంది. దాదాపు 45 ఎకరాల్లో ఉన్న ఈ హోటల్ ని, ఇండియన్-పోర్చుగీస్ స్టైల్ లో డిజైన్ చేశారు. ఇందులో మొత్తంగా 246 రూమ్స్ ఉన్నాయి. భారతదేశం మొత్తంలో లీడ్ ప్లాటినం సర్టిఫికెట్ పొందిన ఒకే ఒక్క రిసార్ట్ ఇదే.
ఈకో ఫ్రెండ్లీ ఫీచర్స్ అంటే, సహజంగా రూపొందించబడ్డ ప్రదేశాలు, నీటిని సప్లై చేసే విధానం, అక్కడ వాడే ఎనర్జీ, వాతావరణం, హోటల్ లో ఉండే నిత్యావసరాల కోసం వాడిన ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ, అక్కడి నేటివిటికి తగ్గట్టు రూపొందించిన విధానం, డిజైన్ చేసిన పద్ధతి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పైన చెప్పినవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటే లీడ్ ప్లాటినం సర్టిఫికెట్ ఇస్తారు. అంటే ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ హోటల్.
ఇందులో వీరు చేసే ఈవెంట్స్ వల్ల కానీ, లేదా వాడే వస్తువుల వల్ల కానీ పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. ఇలాంటి హోటల్ ని రకుల్ ప్రీత్ సింగ్ వాళ్లు పెళ్లి కోసం ఎంచుకున్నారు. అంతే కాకుండా, పెళ్లిలో వడ్డించిన పదార్థాలు అన్నీ కూడా డైట్ ని దృష్టిలో పెట్టుకొని వండినట్టు సమాచారం.