పెళ్లి సమయంలో అబ్బాయిలకి ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయా..? ఈ వ్యక్తి చెప్పింది నిజమేనా..?

Ads

ఒక్కొక్క వ్యక్తికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కొన్నిట్లో చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా పెళ్లి వ్యవహారాల్లో అయితే ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తి మాత్రమే కావాలి అని అనుకునే అమ్మాయిలు, అబ్బాయిలు చాలా మంది ఉంటారు.

ప్రతి వారికి ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్న భాగస్వామి రావాలి అనే ఆలోచనలు ఉంటాయి. అంతే కాకుండా వారి కుటుంబ నేపథ్యం కూడా ఎలా ఉండాలి అనే విషయం మీద కూడా కొంత అవగాహన ఉంటుంది.

అయితే, కొన్ని సార్లు ఈ క్రమంలో అలాంటి రిక్వైర్మెంట్స్ కొంచెం ఎక్కువగా ఉండడంతో అమ్మాయిలకి అబ్బాయిలు ఎక్కువగా నచ్చకపోవడం, అబ్బాయిలకి అమ్మాయిలు ఎక్కువగా నచ్చకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే అలా ఒక అబ్బాయి తన ఆవేదనని వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశాడు. అందులో అబ్బాయి ఈ విధంగా రాశాడు. “నెలకి 1.5 లక్షల జీతం తీసుకొచ్చే నాకు పిల్లని ఇవ్వని ఈ సమాజాన్ని ఏమనాలో అర్థం కాలేదు”.

a man emotional post about marriage requirements

Ads

“వెళ్లిన మ్యాచ్ లో ఒకటి తక్కువ అయ్యింది అంటున్నారు. వ్యవసాయ భూమి ఉండడానికి మేము ఏమైనా రైతులమా? అలాంటప్పుడు భూములు ఉన్న రైతులకే ఇచ్చుకోవచ్చుగా? ఏంటో ఈ సమాజం. కష్టపడి లైఫ్ లో సెటిల్ అయితే అన్ని వస్తాయి అనుకున్నా. మినిమం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యుండాలి. అది కూడా మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తూ ఉండాలి. మూడు ఎకరాల స్థలం ఉండాలి. బ్యాంక్ లో 20 లక్షల బ్యాలెన్స్ ఉండాలి. అలాగే అప్పులు ఉండకూడదు. ఇలాంటి అప్పుడే అన్నా, దళంలో కానీ, సన్యాసంలో కానీ కలిసిపోవాలి అనిపిస్తుంది” అంటూ రాశాడు.

దీన్ని ట్విట్టర్ లో ఒక పేజ్ వారు పోస్ట్ చేయగా అందుకు వివిధ రకమైన కామెంట్స్ వస్తున్నాయి. కొంత మంది, “తమ ఆడ పిల్ల అత్తారింటికి వెళ్ళాక ఎంతో సుఖంగా ఉండాలి అనుకుంటారు కాబట్టి ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి” అని అంటున్నారు. మరి కొంత మంది మాత్రం ఈ వ్యక్తికి మద్దతు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇది ఈ వ్యక్తి మాత్రమే కాదు. సమాజంలో ఎంతో మంది ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని కామెంట్స్ లో చెప్తున్నారు.

Post sourced from : Twitter (@Movies4uOfficl)

ALSO READ : అప్పట్లో షారుఖ్ ఖాన్, మహేష్ బాబు వంటి స్టార్లు ప్రమోట్ చేసిన “బైజూస్” పరిస్థితి ఇప్పుడు ఇలా తయారయ్యింది ఏంటి..? ఏం జరిగిందంటే..?

Previous articleఒకే ఒక్క పాటతో ఫేమస్ అయిన ఈ అబ్బాయి ఎవరో తెలుసా..? ఇతని తల్లిదండ్రులు కూడా మనకి బాగా తెలిసిన వాళ్లే..!
Next article“రకుల్ ప్రీత్ సింగ్” పెళ్లి జరిగిన హోటల్ ఏదో తెలుసా..? అందులో ఒక్క రూంకి ఇంత ఖర్చు అవుతుందా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.