రాజ‌మౌళి, ర‌మ‌ పెళ్లి ఇలా జరిగిందా..? వీళ్ళ లవ్ స్టోరీ ఇదే..!

Ads

దర్శక ధీరుడు రాజమౌళి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రాజమౌళి బాహుబలి సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రపంచ దృష్టిని ఒక్క సారిగా టాలీవుడ్ వైపు తిప్పేశారు రాజమౌళి. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అందరిని మెప్పించింది పైగా రాజమౌళి తో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా అనుకునే విధంగా రాజమౌళి సినిమాలు తీస్తున్నారు.

రాజమౌళి రాఘవేంద్ర రావు వద్ద శిష్యుడిగా పని చేసి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. స్టూడెంట్ నెంబర్ వన్ రాజమౌళి తొలి సినిమా.

ఈ సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్నారు రాజమౌళి. తర్వాత రాజమౌళి ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించారు. ఛత్రపతి, సింహాద్రి, సై, విక్రమార్కుడు, మగధీర, ఈగ, బాహుబలి ఇలా ఎన్నో సినిమాలని తేర మీదకి తీసుకు వచ్చి రాజమౌళి మంచి గుర్తింపును కూడా రాజమౌళి తెచ్చుకున్నారు. రాజమౌళి భార్య రమా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

Ads

ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూ ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. రాజమౌళి సక్సెస్ వెనక ఉన్న సీక్రెట్ కూడా రాజమౌళి కుటుంబమే. ఈ విషయం రాజమౌళి చెప్తూ ఉంటారు. అయితే రమది రెండో పెళ్లి. రాజమౌళి ఈమెకి రెండో భర్త. ఈ విషయం చాలామందికి తెలియదు.

రమా రాజమౌళి గతంలో ఒక అతన్ని వివాహం చేసుకున్నారు మొదటి భర్తకి రమకి కార్తికేయ అనే కొడుకుని కూడా పుట్టాడు. కానీ మనస్పర్ధలు రావడం వలన విడాకులు తీసుకున్నారు. 2000లో రమ ,రాజమౌళి ప్రేమలో పడ్డారు. మొదట వీళ్ళు పరిచయం అవ్వడం ఆ తర్వాత స్నేహం.. ఇది ప్రేమగా మారడం ఆ తర్వాత 2001లో వీళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది. వీళ్లు మయూఖ అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

Previous articleథియేట‌ర్ల‌లో వేసే ఈ యాడ్ లో చిన్నారి మీకు గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే..?
Next articleనాయక్ పాటలో “రామ్ చరణ్” తో పాటు మరొక సెలబ్రిటీ కూడా ఉన్నారు..! ఎవరో తెలుసా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.