Ads
టాలీవుడ్ ఇండస్ట్రీలో శివగామి అంటే ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. నరసింహాలో నీలాంబరి అయినా.. బాహుబలిలో శివగామి అయిన ఆ పాత్రకు అంత పాపులారిటీ వచ్చింది అంటే పాత్ర కంటే కూడా అందులో నటించిన ముఖ్య కారణం. భారీ పాత్రలే కాదు లవ్ స్టోరీలలో కూడా అద్భుతంగా నటించే రమ్యకృష్ణ రియల్ లైఫ్ లవ్ స్టోరీ స్క్రీన్ పైన లవ్ స్టోరీ కంటే ఎన్నో ట్విస్టులతో కూడుకున్నది అన్న విషయం మీకు తెలుసా…?
డైరెక్టర్ కృష్ణ వంశీని పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణ…లవ్ స్టోరీ తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 1990 ప్రాంతంలో టాలీవుడ్ లోనే కాక మిగిలిన ఇండస్ట్రీలో కూడా తన గ్లామర్ తో కుర్ర కారు మతిపోగొట్టిన హీరోయిన్ రమ్యకృష్ణ. 1989లో సూత్రధారులు అనే చిత్రం ద్వారా ఈమె తెలుగు తెరకు పరిచయమైంది. కెరియర్ మొదటి దశలో ఐరన్ లెగ్ గా గుర్తింపు పొందినప్పటికీ…ఆ తరువాత సక్సెస్ తో దూసుకు వెళ్ళింది. 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ దాటిన ఇంకా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం రమ్యకృష్ణ కే సొంతం.
కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ రమ్యకృష్ణ వయసు దాటే వరకు పెళ్లి ఊసే ఎత్తకుండా ఉండిపోయింది . డైరెక్టర్ కృష్ణ వంశీ తో చంద్రలేఖ అనే సినిమా చేసిన తర్వాత అతనితో కొన్ని రోజులు సహజీవనం చేస్తోంది అన్న వార్తలు ఎక్కువగా వచ్చాయి. దీంతో ఇక లాభం లేదని రమ్యకృష్ణకు పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు పూనుకున్నారు. ఆ పెళ్లి ఇష్టం లేని రమ్యకృష్ణ హడావిడిగా ఎవరికి చెప్పకుండా హైదరాబాదులో కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది.
Ads
2003లో పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరి గురించి.. ఇలాంటివి సహజమే ఎన్నాళ్ళు కలిసి ఉంటారో చూద్దాం.. అని పలువురు విమర్శించారు. పెళ్లి చేసుకొని 20 ఏళ్లు గడుస్తున్న ఇంకా వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగానే జీవిస్తున్నారు. ఏడేళ్ల పాటు వీరు ప్రేమించుకున్న విషయం ఇండస్ట్రీలోనే చాలా మందికి తెలియదు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అటు సింధూరం, ఖడ్గం లాంటి దేశ భక్తి సినిమాలతో పాటు, ఇటు మురారి, నిన్నే పెళ్ళాడుతా, గోవిందుడు అందరివాడేలే, చందమామ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను, అంతే కాకుండా అంతపురం, డేంజర్, గులాబీ, సముద్రం లాంటి థ్రిల్లర్ సినిమాలను కూడా కూడా ఎంతో బాగా హ్యాండిల్ చేస్తారు కృష్ణ వంశీ. రమ్యకృష్ణ, కృష్ణ వంశీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా కూడా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కడా బయట పెట్టరు.
ఎన్నో సంవత్సరాలు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా అలరించి తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు రమ్యకృష్ణ. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ బాహుబలి సినిమాలో శివగామి గా తెలుగు సినిమా హిస్టరీలోనే నిలిచిపోయే పాత్ర చేశారు. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయన, హలో, బాలకృష్ణుడు, మామ మంచు అల్లుడు కంచు, శైలజ రెడ్డి అల్లుడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు.