నన్ను ఇండస్ట్రీ బ్యాన్ చెయ్యలేదు.. రష్మిక మందన

Ads

కొన్ని రోజులుగా రష్మిక మందన గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అటు సినివర్గాల్లోనూ,ఇటు సోషల్ మీడియాలోనూ కన్నడ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ రష్మిక మందనను బ్యాన్ చేశారంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి

అయితే హీరోహీరోయిన్లను బ్యాన్ చేయడమంటే అంత చిన్న విషయం అయితే కాదు. అందులోను టాప్ ప్లేస్ లో, నేషనల్ వైడ్‌గా పేరు తెచ్చుకుని దూసుకుపోతున్న హీరోయిన్లను బ్యాన్ చేయడానికి ఎవ్వరూ ముందుకు కూడా రారు. ఆలాంటిది సాండల్ వుడ్ రష్మికను బ్యాన్ చేసిందంటూ వస్తున్న వార్తలు కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయం పై నేషనల్ బ్యూటీ రష్మిక స్పందించింది.

Ads

కన్నడ సినీ పరిశ్రమ నుండి వచ్చిన రష్మిక మందన్న తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యింది. రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో వరుసగా నటించింది. అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవల చిన్న సినిమాగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన రిషబ్ శెట్టి కాంతార చిత్రం రష్మికను ఇబ్బందులకి గురిచేసింది. కాంతర సినిమాను చూడలేదని రష్మిక అనడంతో కన్నడ అభిమానులు సీరియస్ అయ్యారు. ఆమెను వెండితెరకు ఇంట్రడ్యూస్ చేసిన సొంత ఇండస్ట్రీనే రష్మిక మర్చిపోయిందంటూ మండిపడ్డారు.
ఇక రష్మిక కూడా అసలే సీరియస్ గా ఉన్న కన్నడ ఫ్యాన్స్ కి మరింత కోపం వచ్చేలా తన మొదటి ప్రొడక్షన్ కంపెనీ పేరు చెప్పకుండా సైగలతో చూపించింది. ఇక దీనిపై దర్శకుడు రిషభ్ శెట్టి సైతం రష్మికకు కౌంటర్లు వేసాడు. ఇలా ఈ వివాదం పెద్దగా మారి, రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందంటూ వార్తలు వచ్చాయి.
కాగా ఈ వార్తలపై తాజాగా రష్మిక స్పందించింది. కాంతర విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే మూవీ చూశారా అడగడంతో అప్పటికి చూడలేదు. అదే చెప్పాను. ఇటీవలే మూవీని చూసి, బాగుందని కాంతర టీంకు మెసెజ్ పెట్టాను. థాంక్యూ అని రిప్లై వచ్చింది. ఇక నా పర్సనల్ విషయాలను అందరికి చెప్పాలనుకోను. వృత్తి పరమైన విషయాలు అందరికి చెప్తాను. నన్ను ఎవరూ బ్యాన్ చెయ్యలేదని రష్మిక తెలిపింది.

Also Read: పూరి జగన్నాథ్ తొలి సినిమా ‘బద్రి’ గురించి ఆసక్తికర విషయాలు..

Previous articleవైరల్ అవుతున్న కొత్త బంగారు లోకం హీరోయిన్ లేటెస్ట్ ఫోటోస్..
Next articleపవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంచ్ లో త్రివిక్రమ్ ఎందుకు మిస్సయ్యాడు?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.