‘యమదొంగ’ సినిమాలో సత్యనారాయణ యముడుగా నటించకపోవడానికి కారణం ఇదేనా?

Ads

తెలుగు సినిమాల్లో యముడు అనగానే గుర్తొచ్చేది కైకాల సత్యనారాయణ రూపం. ఆయన ఎన్నో సినిమాలలో యముడిగా నటించి మెప్పించారు. అద్భుతమైన నటనతో యముడు నిజంగా ఇలాగే ఉంటాడేమో అనిపించేలా సత్యనారాయణ మెప్పించారు.

Ads

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తన కెరీర్ లో ఎన్నో చిత్రాలలో మరెన్నో రకాల పాత్రలు పోషించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. నవరసాలను ఒలికించగల ప్రతిభ ఆయన సొంతం. ఆయన తన అరవై ఏళ్ళ సినీ కెరీర్ లో 700కు పైగానే చిత్రాల్లో నటించారు. ఇక ఆయన ఎన్నో సినిమాల్లో యముడి పాత్రలో నటించారు. అయితే ఆయన రాజమౌళి తీసిన ‘యమదొంగ’ సినిమాలో మాత్రం నటించలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీలో యముడి పాత్రకోసం తనని అడిగారని అప్పట్లో సత్యనారాయణ తెలిపారు.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో పాల్గొన్న సత్యనారాయణ ఈ విషయాన్ని తెలియచేసారు. ఇక అందులో యముడు పాత్రంటే మీకు ఇష్టమేనా అన్న ప్రశ్నకు ఆయన, తొలిసారిగా యమగోల సినిమాలో నేను, రామారావుగారు ఆ పాత్ర వేశాం. అందులో ఇద్దరం పోటీపడి నటించాము. తొలి రోజుల్లో నేను దుర్యోధనుడి పాత్రకు పనికిరానని అన్నారు. అయితే ఆ పాత్రకు ఎవరూ సరిపోకపోవడంతో రామారావుగారికి చెప్తే, వాళ్ళని తిట్టి, ఆయన ఆ పాత్రకు నన్ను సూచించారు. ఇక యముడి పాత్రలోనూ మేమిద్దరం పోటీపడ్డాము.
ఆ తర్వాత కొన్నేళ్లకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘యముడికి మొగుడు’ సినిమాలో యముడిగా నటించాను. ఆ తరువాత యమలీల, పిట్టలదొర, ఇలా యముడి పాత్ర అనగానే ఏ సినిమాలోనైనా నేనే అన్నట్లుగా అయ్యింది. నా కెరీర్ లో కృష్ణుడు, రాముడి పాత్రలు తప్ప ఎన్టీఆర్ చేసిన అన్ని పాత్రలు నేను చేశాను. అయితే ఒకసారి ఎన్టీఆర్ డూప్‌గా కృష్ణుడి పాత్ర చేశాను. ఇక యమదొంగ సినిమాలోనూ అవకాశం వచ్చింది. పారితోషకం విషయంలో తేడా రావడంతో నేనే వేయనని చెప్పాను అని సత్యనారాయణ తెలిపారు.

Also Read: టాలీవుడ్ లోని ఈ 10 మంది స్టార్ హీరోల పెళ్లి పత్రికలూ ఎప్పుడైనా చూసారా?

Previous articleకైకాల సత్యనారాయణను విలన్ గా మార్చింది ఆయనేనా..?
Next articleదర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు మూవీ తరువాత చేయబోయే సినిమా ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.