Ads
రామ్ చరణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా అందరికీ గుర్తుండి పోయింది. 2010లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ సరసన జెనీలియా నటించింది. భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కే నాగేంద్రబాబు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాలో పాటలు కూడా అందరిని బాగా ఆకట్టుకున్నాయి.
మళ్లీ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని మొన్న రీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ రీ రిలీజ్ కి వెళ్లి సందడి చేశారు. అయితే ఆరెంజ్ సినిమా అంతా బానే ఉంది కానీ అసలు సినిమాకి ఆరెంజ్ అని ఎందుకు టైటిల్ పెట్టారు దాని వెనుక కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
Ads
ఈ పేరు కి తగ్గట్టు సినిమా లో ఏం లేదు. కానీ ఆరెంజ్ కాదు అది.. అది ఓ రేంజ్. అందుకే టైటిల్ ని ఇలా పెట్టారు అని చెప్పచ్చు. అలానే ఆరెంజ్ అంటే శాంతికి చిహ్నం అని కూడా వస్తుంది. అలానే ఆరెంజ్ అంటే ప్యూర్ లవ్ అని కూడా అర్థం వస్తుంది. ఓ రేంజ్ ప్రేమ ఇది కనుక ఓ రేంజ్ (O Range ) అనే టైటిల్ ని పెట్టారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కారణాల వలన ఈ సినిమా కి ఆ టైటిల్ ఫిక్స్ చేశారని మనం చెప్పొచ్చు. కానీ క్లియర్ గా దానికి అర్థం మనకి తెలియదు.
సినిమా అయితే ఓ రేంజ్ లో ఉంది అందులో డౌట్ లేదు. రీ రిలీజ్ కూడా సినిమా ఓ రేంజ్ లో ఉందనే చేశారు. పైగా ఈ సినిమా చాలా మందికి ఫేవరెట్ కూడా. నిజానికి ఆ సినిమా టైటిల్ ఎందుకు ఆరెంజ్ అని పెట్టారనేది బొమ్మరిల్లు భాస్కర్ కి మాత్రమే తెలియాలి. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ఇప్పుడు మళ్లీ కొన్ని సినిమాలతో బిజీ అయిపోయాడు రామ్ చరణ్. మరి రామ్ చరణ్ రాబోయే సినిమాలు ఎలా ఆకట్టుకుంటాయి చూడాలి.