AC vs కూలర్లు… ఏసీ నుండి వచ్చే గాలి మంచిదా..? కూలర్ల నుండి వచ్చే గాలి మంచిదా..?

Ads

వేసవి వచ్చిందంటే చాలు అందరూ ఇళ్ళకి అతుక్కుపోతారు. చల్లటి ప్రదేశంలో ఉండడానికే ఇష్ట పడతారు. బయటకు వెళ్లి పనులు చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. వేసవి కాలంలో
ఫ్యాన్ల కి విశ్రాంతి కూడా ఉండదు. అలానే చాలా మంది ఎయిర్ కూలర్స్ ని ఎయిర్ కండిషనర్ ని కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే రెండిట్లో ఏ గాలి మంచిది..?

ఏసీ నుండి వచ్చే గాలి నాణ్యమైనదా లేదంటే కూలర్ లో వచ్చే గాలి నాణ్యమైనదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీకు కూడా ఎప్పుడైనా ఈ సందేహం కలిగిందా..? అయితే వెంటనే క్లియర్ చేసుకోండి.

ఎయిర్ కండిషనర్ గదిలో ఒకే గాలిని తీసుకుని చల్లదానిగా మార్చి బయటికి విడిచి పెడుతుంది దీంతో ఆ గాలి ఎంతో పొడిగా ఉంటుంది. అదే కూలర్ అయితే తాజా గాలిని తీసుకుంటుంది గాలిని చల్లబరిచి చల్లని తాజా గాలిని ఇస్తుంది. కూలర్ నుండి వచ్చే గాలి తేమతో కూడుకుని ఉంటుంది. సో ఈ రెండిటిని కంపేర్ చేసి చూస్తే కూలర్ల లో గాలి నాణ్యమైనది. 100% అది నాణ్యమైనది. ఈ కూలర్లలో గాలి చల్లగా మారడానికి నీళ్లు అవసరం. అందుకనే ఎయిర్ కూలర్ గాలి నాచురల్ గా ఉంటుంది. ఆస్తమా, డస్ట్ ఎలర్జీ వంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ గాలే మంచిది.

Ads

ఇక ఏసీ గురించి చూస్తే క్లోరో ఫ్లోరో కార్బన్, హైడ్రోక్లోరో ఫ్లోరో కార్బన్ ద్వారా ఏసీ గాలి చల్లబడుతుంది. పర్యావరణానికి హాని కలిగించే కెమికల్స్ ఇందులో ఉంటాయి. ఇది ఎంత ప్రమాదం అంటే ఓజోన్ లేయర్ ని దెబ్బతీసే అంత. ఏసీ గాలి వలన శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రమాదం. పైగా కూలర్ చాలా తక్కువ ధరకే వస్తుంది. పైగా ఏసీలను మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే. ఎక్కువ ధరతో కూడుకున్నది. కూలర్లని మనం ఒక గది నుండి ఒక గదిలోకి మార్చుకోవచ్చు. ఇలా ఎన్ని విధాలుగా చూసినా కూలర్ల వల్లే ఎక్కువ ప్లస్ కనబడుతోంది.

Previous articleరామ్ చరణ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ “ఆరెంజ్” సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు ? టైటిల్ వెనక స్టోరీ..!
Next articleషారుఖాన్ నుంచి సమంత వరకు మన స్టార్స్ మొదటి సంపాదన ఎంత ? అప్పట్లో ఏ ఉద్యోగులు చేసారు ?