సినీరంగానికి చెందిన ఈ 13 మంది ప్రముఖులు బంధువులు అని తెలుసా?

Ads

సాధారణంగా ఏ రంగంలోనైనా బంధువులు ఉంటారు. కానీ సెలబ్రిటీల విషయంలో మాత్రమే బంధువులు ఉన్నారని తెలియగానే చర్చలు మొదలుపెడతాము.

ఇక తెలుగు సినీ పరిశ్రమలో సినీ పెద్దల కుటుంబాలు ఉన్నాయి. వారి వారసులు కూడా ఇదే రంగంలో ముందుకెళ్తున్నారు.ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే,మనకు బంధువులుగా కనిపించని ప్రముఖులు కూడా ఉన్నారు. వారు ఎవరో ఎప్పుడు చూద్దాం..1.సావిత్రి-రేఖ:
మహానటి సావిత్రి, బాలీవుడ్ హీరోయిన్ రేఖకు పినతల్లి అవుతుంది.సావిత్రి జెమిని గణేష్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే జెమిని గణేష్ సావిత్రి కంటే ముందు రేఖ తల్లి పుష్పవల్లితో కొద్దిరోజులు సహజీవనం చేశారు.
2.కమల్ హాసన్-సుహాసిని:
హీరోయిన్ సుహాసిని కమల్ హాసన్ అన్నా చారు హాసన్ కుమార్తె. అంటే కమల్ కి కూతురు అవుతుంది. అందుకే కమల్ సుహాసినితో నటించలేదు.
3.జయసుధ-విజయనిర్మల:
జయసుధకు విజయనిర్మల పిన్ని అవుతుంది.పండంటి కాపురం సినిమాతో సినిమాల్లోకి వచ్చింది.
4.రజినీకాంత్-అనిరుధ్:
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ మామ అవుతారు. రజినీకాంత్ భార్య లత అన్నయ్య కుమారుడే అనిరుధ్.
5.కే విశ్వనాథ్-చంద్రమోహన్:
కళాతపస్వి కే విశ్వనాథ్, చంద్ర మోహన్ కజిన్ బ్రదర్స్.
6.నగ్మా జ్యోతిక రోషిణి:
హీరోయిన్ నగ్మా కి జ్యోతిక, రోషిణి ఇద్దరు చెల్లెళ్ళు అవుతారు. వీరిద్దరూ నగ్మా తండ్రి రెండవ భార్య కూతుర్లు.
7.శ్రీలక్ష్మి-ఐశ్వర్య రాజేష్:
హాస్యనటి శ్రీలక్ష్మి తమ్ముడి కుమార్తె ఐశ్వర్య రాజేష్, ఆమెకు మేనకోడలు అవుతుంది.
8.ఆర్ రెహమాన్ జీవి ప్రకాష్
ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కి జీవి ప్రకాష్ మేన అల్లుడు అవుతాడు.
9.విజయ్ కుమార్-అరుణ్ విజయ్
సీనియర్ నటుడు విజయ్ కుమార్ మొదటి భార్య ముత్తుకున్ను కొడుకే అరుణ్ విజయ్,ముత్తుకున్ను మరణించిన తరువాత నటి మంజులను వివాహం చేసుకున్నాడు. వారి సంతానం వనిత, ప్రీతి, శ్రీదేవి.
10.ప్రియమణి-విద్యాబాలన్:
హీరోయిన్ ప్రియమణికి బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కజిన్ సిస్టర్ అవుతారు.

Ads

11.RB చౌదరి-జీవా:
కోలీవుడ్ హీరో జీవా ప్రొడ్యూసర్ ఆర్ బి చౌదరి కుమారుడు.
12.సెల్వ రాఘవన్-విధ్యుల్లేఖ:
హాస్యనటి విధ్యుల్లేఖకు డైరెక్టర్ సెల్వ రాఘవన్ బావ వరుస అవుతాడు.
13.షబానా అజ్మీ-టాబు:
అలనాటి బాలీవుడ్ హీరోయిన్ షబానా అజ్మీకి హీరోయిన్ టబు మేనకోడలు అవుతుంది.

Also Read: సీనియర్ ఎన్టీఆర్ నుండి అడివి శేష్ వరకు.. టాలీవుడ్ హీరోలు ఏం చదివారో తెలుసా?

Previous articleఈ పథకాల్ని ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెస్ కే సొంతం !
Next articleఈ 20 మంది నటీనటులపేర్లు ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.