Ads
విశాఖపట్నంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి T20 ఇంటర్నేషనల్‌లో భారత్ రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కీలకమైన నాక్‌లు ఆడారు.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఇన్‌గ్లి్‌స (50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 110) శతకం, స్మిత్ (41 బంతుల్లో 8 ఫోర్లతో 52) అర్ధసెంచరీ సాధించారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసారు. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు ఓపెనర్ రుతురాజ్ (0) ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే తొలి ఓవర్లోనే రనౌట్ అయ్యాడు. జైస్వాల్ మూడో ఓవర్‌లో వరుసగా 4, 6 బాది తర్వాత అవుట్ అయ్యాడు.
63/2 స్కోరు దగ్గర నుండి కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 80), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 58) పార్టనర్ షిప్ తో గెలుపు ఇండియా సొంతం అయ్యింది. చివరిలో కొంచెం ఒత్తిడికి గురయ్యి వరస వికెట్లు కోల్పోయినా రింకూ సింగ్ (14 బంతుల్లో 4 ఫోర్లతో 22 నాటౌట్) ఫినిషర్ పాత్ర పోషించి భారత్ ని గెలిపించాడు. నిజానికి రింకూ సింగ్ చాలా ప్రెషర్ కండిషన్ లో ఆడాడు. అతని ఆట చూసిన ఇండియా ఫాన్స్ ప్రస్తుతం ఇండియాకి మరో ధోని దొరికేసాడు అంటున్నారు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉంది. ఇలాంటి ఆటగాడు జట్టులో ఉండడం తప్పనిసరి అంటున్నారు.
Ads
మ్యాచ్ అనంతరం బీసీసీఐ ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో రింకూ సింగ్ ధోని గురించి ప్రస్తావించాడు..”నేను మహి భాయ్ (మహేంద్ర సింగ్ ధోని)తో ఒకటి లేదా రెండుసార్లు మాట్లాడాను…ప్రెషర్ సిట్యుయేషన్స్ లో ఎలా ఎదురుకోవాలి అనేది ధోని చెప్పారు. ఈ రోజు బ్యాటింగ్ కి వచ్చినప్పుడు ధోని చెప్పిన విషయాలనే దృష్టిలో పెట్టుకొని బ్యాట్టింగ్ చేశాను. ధోని కూడా 5 లేదా 6 వ పోసిషన్ లో బ్యాటింగ్ కి వస్తారు. ఇప్పుడు నేను అదే బ్యాటింగ్ ఆర్డర్ లో ఆడుతున్నాను. నా బ్యాటింగ్ ని ఎలా మెరుగుపరుచుకోవాలి అని ధోనిని అడిగితే…నువ్వు చాలా బాగా ఆడుతున్నావు…అదే కొనసాగించు అని సలహా ఇచ్చారు”..అని రింకూ చెప్పాడు.
The MSD touch 🧊 behind Rinku Singh's ice cool finish 💥
Do not miss the 𝙍𝙞𝙣𝙠𝙪 𝙍𝙚𝙘𝙖𝙥 that includes a perfect GIF describing #TeamIndia's win 😉
WATCH 🎥🔽 – By @28anand | #INDvAUShttps://t.co/MbyHYkiCco
— BCCI (@BCCI) November 24, 2023
సోషల్ మీడియాలో ఎంతో మంది ధోని క్రెడిట్ స్టీలర్ అని ట్రోల్ల్స్ చేస్తారు కానీ…ఆయన ఎప్పుడు కూడా నా వల్లే ఇండియా కి వరల్డ్ కప్ వచ్చింది అని చెప్పుకోలేదు. అంత ఫ్యాన్ బేస్ ఉండి కూడా ఎప్పుడు ఆటిట్యూడ్ తో మాట్లాడలేదు. హేటర్స్ ట్రోల్ చేస్తారు కానీ…యంగ్ జనరేషన్ క్రికెటర్స్ మాత్రం ఆయన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు.
2023 ఐపీఎల్ లో కూడా అద్భుతంగా ఆడాడు రింకూ… గుజరాత్ టైటాన్స్ పై 5 బంతుల్లో 5 సిక్సులు కొట్టిన అతని ఇన్నింగ్స్ ఎప్పటికి మరచిపోలేము. చివరి ఓవర్ లో 28 పరుగులు కొట్టాల్సిన పరిస్థితుల్లో అతను తన టీం కోల్కత్త నైట్ రైడర్స్ ను గెలిపించాడు. 2023 ఐపీఎల్ లో 14 మ్యాచుల్లో 150 స్ట్రైక్ రేట్ తో 474 పరుగులు చేసాడు రింకూ సింగ్.