Ads
ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, తర్వాత స్టార్ హీరోలు అందరితోనూ నటించి, స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు సమంత. అటు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ, నటనకి ఆస్కారం ఉన్న సినిమాలు కూడా చేశారు.
కానీ ఇప్పుడు కేవలం తన పాత్ర స్కోప్ ని బట్టి మాత్రమే సమంత సినిమాలు చేస్తున్నారు. నటనకి ఆస్కారం ఉన్న స్క్రిప్ట్ లని మాత్రమే సమంత ఎంచుకుంటున్నారు. సమంత గత కొంత కాలం నుండి ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు.
అలాగే యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా సమంత చేస్తున్నారు. ఇప్పుడు సమంత కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, బాలీవుడ్ లో కూడా చాలా ఫేమస్ అయిపోయారు. సమంత బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నారు అనే వార్త కూడా వచ్చింది. అందులో సల్మాన్ ఖాన్ హీరో అని అంటున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
Ads
సమంత మ్యాగజిన్స్ కి కూడా ఫోటోషూట్స్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఫెమీనా అనే ఒక మ్యాగజిన్ కి ఫోటో షూట్ చేశారు. ఈ ఫోటో షూట్ పిక్చర్స్ ఇవాళ విడుదల చేశారు. ఇందులో సమంత చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. సమంతని చూస్తూ ఉంటే హాలీవుడ్ నటి కైలీ జెన్నర్ గుర్తొస్తున్నారు అని చాలా మంది అంటున్నారు. ఈ ఫోటో షూట్ లో మేకప్, కాస్ట్యూమ్స్ అని కూడా ఆమెని గుర్తు చేస్తున్నాయి అని అంటున్నారు. సమంత ఇటీవల టేక్ 20 అని ఒక పాడ్ కాస్ట్ కూడా మొదలు పెట్టారు.
ఇందులో శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలని సమంత చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ పాడ్ కాస్ట్ కి సంబంధించి రెండు ఎపిసోడ్లు విడుదల అయ్యాయి. అవి చాలా మంచి స్పందన అందుకున్నాయి. సమంత యూట్యూబ్ ఛానల్ లో వీటిని పోస్ట్ చేశారు. ఇది చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా మంచి సమాచారం ఇచ్చారు అంటూ సమంతని పొగుడుతున్నారు. అలా సామాజిక స్పృహతో తనకి చేతనైనంత అవగాహన కల్పించడానికి సమంత ముందడుగు వేస్తున్నారు.
ALSO READ : ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది..! ఎవరో తెలుసా..?