సలార్ పార్ట్-2 లో హీరోలకి గొడవ అవ్వడానికి ఈ “మ్యాథ్స్ ప్రాబ్లం” కారణమా..? ఈ టీచర్ చెప్పిన లెక్క చూశారా..?

Ads

సినిమాల ప్రభావం జనాలు మీద ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో వాడిన రిఫరెన్స్ లు వాడడం, డైలాగ్స్ వాడడం, పంచ్ లైన్స్ వాడడం వంటివి జరుగుతూనే ఉంటాయి.

అందుకే సినిమాల్లో డైలాగ్స్ కూడా చాలా వరకు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలాగా, లేదా ఎప్పుడైనా సందర్భోచితంగా వాడినప్పుడు వచ్చేలాగా రాసుకుంటూ ఉంటారు. సినిమాల్లో డైలాగ్స్ సంగతి సరే. కానీ సినిమాలని వాడి పాఠాలు కూడా చెప్తున్నారు.

అంటే, సినిమాల్లో పాత్రల మీద పాఠాలు చెప్పడం కాదు. సినిమాల్లో జరిగిన సంఘటనలను వాడి పాఠాలు చెప్తున్నారు. అలా ఇటీవల ఒక సంఘటన జరిగింది. ప్రభాస్ హీరోగా ఇటీవల సలార్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ మరొక హీరోగా నటించారు. అయితే ఒక లెక్చరర్, సలార్ సినిమాలో హీరోలు విడిపోవడానికి కారణం ఒక లెక్క అంటూ, ఒక లెక్క చెప్పి, దానికి సొల్యూషన్ చెప్పమని అడిగారు.

salaar reference for a calculation

Ads

తర్వాత ఆయనే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పారు. ఈ సంఘటన ఎన్ఐటి భోపాల్ లో జరిగినట్టు సమాచారం. కొంత మంది విద్యార్థులకు రెక్టాంగిల్ కి సంబంధించిన ఒక ప్రాబ్లం చెప్పి, అందుకు రిఫరెన్స్ గా సలార్ సినిమాని వాడారు. ఏదైనా సరే, తాము చెప్పే పాఠం విద్యార్థులకు సరిగ్గా అర్థం అవ్వాలి అనేది టీచర్ల యొక్క ఉద్దేశం. అందుకోసం వారికి ఎలాంటి ఉదాహరణలు వస్తే అలాంటి ఉదాహరణలు తీసుకొని విద్యార్థులకు సులువుగా అర్థం అయ్యేలాగా వివరించి చెప్తారు.

ఇలా చెప్పడం వలన, తర్వాత అలాంటి ప్రాబ్లం ఎగ్జామ్ లో వచ్చేటప్పుడు కూడా ఈ ఉదాహరణని గుర్తు తెచ్చుకొని ఆ ప్రాబ్లం పరిష్కరించగలుగుతారు. అలా ఒక గుర్తు ఉండడానికి ఇలాంటి ఉదాహరణలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ లెక్చరర్ కూడా అలాగే చేశారు. సలార్ సినిమా రిఫరెన్స్ తీసుకొని చెప్తే ఇంకా ఈజీగా అర్థం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలా చెప్పారు. ఏదేమైనా సరే, ఇలాంటి ఆలోచన వచ్చినందుకు ఆ లెక్చరర్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా కొత్తగా ఆలోచించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

ALSO READ : సద్గురు కూడా సినిమాలో నటించారు అని మీకు తెలుసా..? ఏ సినిమాలో అంటే..?

Previous articleహృదయాల్ని స్పృశించే అందమైన ప్రేమకథ “లంబసింగి” మార్చి 15న థియేటర్స్ లో విడుదల !!!
Next articleపూర్తిగా మారిపోయిన సమంత..! అచ్చం హాలీవుడ్ హీరోయిన్ లాగానే ఉన్నారు..!