Ads
స్టార్ హీరోయిన్ సమంతకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె హీరోయిన్ గా నటించిన ప్యాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినీమా ఫిబ్రవరి 17న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
Ads
సోమవారం జరిగిన శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ సమంత, హీరో దేవ్ మోహన్,డైరెక్టర్ గుణశేఖర్, ప్రోడుసర్స్ దిల్ రాజు, నీలిమ గుణ తదితరులు హాజరు అయ్యారు. ఇక ఈవెంట్‌లో హీరోయిన్ సమంతతో పాటు, దర్శకుడు గుణశేఖర్ కూడా ఎమోషనల్ అయ్యారు. గుణశేఖర్ సినిమా గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకోగా, ఆ సమయంలో సమంత కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత కంటతడి పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
అయితే ఈ వీడియోపైనే కాకుండా సమంతలో వచ్చిన మార్పులపై కూడా సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ట్విటర్ లో బజ్ బాస్కెట్ అనే ఖాతాలో హీరోయిన్ సమంతను చూస్తే జాలిగా ఉంది. ఆమె డైవర్స్ నుండి బయటకు వచ్చి, కెరీర్ లో ముందుకు వెళ్తుంది అనుకునే టైమ్ లోనే మైయోసైటిస్ అనే జబ్బు వచ్చి, బలహీనురాలిగా చేసింది. అంతేకాకుండా సమంత అందాన్ని కూడా పోగొట్టుకుందని రాసుకొచ్చారు.
అయితే ఈ పోస్టు పై హీరోయిన్ సమంత తాజాగా స్పందించారు. ఆమె తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు. ‘మీరు నాలాగా నెలల తరబడి చికిత్స తీసుకోకూడదని ఆ దేవుడ్ని మీకోసం ప్రార్థిస్తున్నా, మీరు బావుండాలని కొంచెం ప్రేమను కూడా పంపిస్తున్నా’ అని తెలిపింది. అయితే సమంత ఇచ్చిన ఈ రిప్లైకి ఆమె అభిమానులతో పాటుగా నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ లో ఆరాధ్య అనే మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
Also Read: చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ లో ఉన్నా మైనస్ లు ఇవే..!