Ads
మయోసైటిస్ వ్యాధి బారిన పడి దాన్నుంచి కోలుకున్న సమంత ఖుషి సినిమాని కంప్లీట్ చేసింది. ఈ సినిమా ద్వారా ఒక మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన ఈ భామ పూర్తిగా కోలుకున్న తర్వాతే సినిమాలు చేయాలని కమిట్ అయింది.
అందుకే ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్టులను కూడా ఆమె వదులుకుందని సమాచారం. అప్పటినుంచి దేశాలు పట్టుకుని తిరుగుతూ మానసికంగా శారీరకంగా దృఢంగా మారేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
ఇక లేటెస్ట్ గా ఒక బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ భామ. త్వరలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. 58 ఏళ్ల హీరోకి జోడిగా నటించటానికి సిద్ధపడింది. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే కండల వీరుడు సల్మాన్ ఖాన్.ఈ హీరో పక్కన బాలీవుడ్ లో ఫుల్ లెంత్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ లో ఒక సౌత్ ఇండియా హీరోయిన్ ని మాత్రమే తీసుకోవాలని కండిషన్ పెట్టాడంట.
Ads
ఆ పాత్ర కోసం సమంత అయితే బెటర్ అని దర్శకుడు విష్ణువర్ధన్ ఆమెను అప్లోడ్ చేయడట. ఇదే పాత్ర కోసం గతంలో త్రిషను అడిగారట తను తన నిర్ణయాన్ని చెప్పకపోవడంతో సమంతని అప్రోచ్ అయినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తో పంజా సినిమాను తెరకెక్కించిన స్టైలిష్ డైరెక్టర్ విష్ణువర్ధన్ తో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఒక సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు కోసమే సమంతను ఎప్రోచ్ అయినట్లు సమాచారం.
సమంత కూడా కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ లో పాగా వేయటం కోసం ప్రయత్నాలు చేస్తుంది. అలాంటిది ఆమె ఈ ఛాన్స్ ని మిస్ చేసుకుంటుందని అనుకోలేము. ఒక సంవత్సరం పాటు నటించకూడదు అని తను తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెట్టి మరీ ఈ ప్రాజెక్టుకి సైన్ చేయబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.