టీచర్ కి తన హోంవర్క్ చూపించింది… కానీ అందులో ఈ అమ్మాయి ఏం రాసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Ads

ఈమధ్య ప్రతి ఒక్కరికి రీల్స్ చేయడం అనేది బాగా అలవాటైపోయింది. ప్రతి చిన్న విషయాన్ని రీల్స్ తీయడం, దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడం, చూసినవాళ్లు నచ్చినట్లు కామెంట్ చేయడం జరుగుతుంది. కేవలం రీల్స్ ద్వారానే ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.

ఇందులో కొన్ని రీల్స్ మెసేజ్ ని ఇస్తే, కొన్ని రీల్స్ ఫన్నీ ఇన్సిడెంట్స్ తో మనకి చాలా నవ్వు తెప్పిస్తాయి. కొన్ని రీల్స్ లో తమ టాలెంట్ ని బయట పెట్టుకుంటారు చాలామంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రీల్ తెగ వైరల్ అవుతుంది. ఒక టీచర్ ఇచ్చిన హోంవర్క్ ని ఒక స్టూడెంట్ మిస్ అండర్స్టాండింగ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసి తీసుకువచ్చి టీచర్ కి చూపించడంతో అవాక్కవ్వటం ఆ టీచర్ వంతవుతుంది.

student funny mistake to teacher home work assignment

Ads

ఇంతకీ ఏం జరిగిందంటే ఒక టీచర్ అక్షరమాలని రెండుసార్లు రాసుకు రమ్మని హోంవర్క్ ఇస్తే అది అర్థం చేసుకోలేక ఆ బాలిక పేపర్ మీద రాసింది రాసినట్లు పేపర్ మొత్తం ఫిల్ చేసి తీసుకు వస్తుంది. అయితే అది చూసిన టీచర్ షాక్ అవుతుంది. ఆ వీడియోలో ఆ పాప అమాయకపు మొహం కూడా కనిపించడం విశేషం. అంటే అప్పటికి కూడా ఆ అమ్మాయి తప్పు చేసిన విషయం గ్రహించ లేకపోవడం గమనార్హం. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

student funny mistake to teacher home work assignment

అచ్చమైన కాపీ పేస్ట్ కి ప్రతిరూపం ఈ హోం వర్క్ అంటూ తెగ నవ్వుకుంటున్నారు నెటిజన్స్. ఏదైనా చిన్నప్పుడు తెలిసీ తెలియని వయసులో చేసే మిస్టేక్స్ చాలా సరదాగా ఉంటాయి కదా. ఆ నిమిషం బాధనిపించినా తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ తలుచుకొని పెద్దయ్యాక నవ్వుకోవడం సహజం. ఈ వీడియో చూసిన నెటిజన్స్ చాలామంది వారి గతంలోకి వెళ్లి బాల్య స్మృతులు తలుచుకొని ఉంటారు.

Previous article58 ఏళ్ల హీరోకి జోడిగా 36 ఏళ్ల సమంత..! ఎవరంటే..?
Next article“లెజెండ్ శరవణన్” నెక్స్ట్ సినిమాని ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా..? కారణం ఏంటంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.