“అనుష్క శర్మ” రెండవసారి గర్భం దాల్చిన విషయాన్ని ఇంత రహస్యంగా ఎందుకు ఉంచారు..? కారణాలు ఇవేనా..?

Ads

ఒక జంట తల్లిదండ్రులు కాబోతున్నారు అంటే వారి జీవితంలో అది అత్యంత ఆనందదాయకమైన విషయం. ఈ విషయాన్ని పదిమందితో చెప్పుకొని పండగ చేసుకుంటారు కుటుంబ సభ్యులు.

స్టార్ కపుల్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట కూడా మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్న సమయంలో ఇలాగే సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసి తమ ఆనందాన్ని షేర్ చేసుకుంది.

కానీ ఈ జంట రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్న సమయంలో ఎందుకో గోప్యత పాటించారు. ఫిబ్రవరి 15న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట ఐదు రోజుల తర్వాత బాబు పుట్టినరోజుని ఎనౌన్స్ చేశారు. అయితే ఈ జంట ఎందుకు గోప్యత పాటించారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలా ఎందుకు చేశారో అంటూ చాలామంది చర్చలు కూడా చేస్తున్నారు. అందుకు గల కారణాలను కూడా ఊహించేస్తున్నారు.ఆ కారణాలు ఇవే అంటూ కొన్ని రీజన్స్ కూడా చూపిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

reason why anushka and virat kept child birth as secret

కుటుంబ ఆచారం : అనుష్క శర్మ, విరాట్ విభిన్న నేపథ్యం, సంస్కృతుల నుంచి వచ్చారు. వారి సాంప్రదాయాల ప్రకారం తమ పెద్దలను సంప్రదించి వారి ఆశీర్వచనాలతో పాటు సలహాల ప్రకారమే ఇలాంటి గోప్యతను పాటించి ఉండవచ్చు అంటున్నారు.

Ads

ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయటానికి : తమని ప్రాణంగా ప్రేమించే అభిమానులకి సర్ప్రైజ్ ఇవ్వటం కోసం ఈ జంట రెండవ గర్భాన్ని గురించిన గోప్యత పాటించి ఉండవచ్చు. ఎందుకంటే విరాట్, అనుష్కల జంటకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ సంగతి అందరికీ తెలిసిందే కదా.

anushka sharma virat kohli son name meaning telugu

మీడియా ఒత్తిడి : మొదటిసారి ఈ జంట ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఆ విషయాన్ని మీడియా కి వెల్లడించడమే కాకుండా ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. అయితే మీడియా అనుష్క డెలివరీ అయినంతవరకు ప్రతి విషయాన్ని క్యాచ్ చేయాలనుకునే ప్రయత్నంలో ఆ జంట ని తీవ్ర ఒత్తిడి కి గురి చేశారు. అందుకే ఈసారి అలాంటి ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం కోసం గోప్యత పాటించి ఉండవచ్చు.

పర్సనల్ టైం: ఈ జంట తమ రెండవ బిడ్డ రాకను నిశ్శబ్దంగా ఆనందించాలని కోరుకొని ఉంటారు. ఇద్దరూ ప్రశాంతంగా ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయాలని భావించి ఉంటారు అందుకే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ఉంటారు అంటున్నారు నెటిజెన్స్.

అయితే ఈ కారణాలు అన్ని అభిమానుల ఊహాగానాలు మాత్రమే.

Previous articleనాని ప్రేమ కథ గురించి తెలుసా..? అన్ని సంవత్సరాలు వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే..?
Next article58 ఏళ్ల హీరోకి జోడిగా 36 ఏళ్ల సమంత..! ఎవరంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.