Ads
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన ‘సప్తసాగరాలు దాచే ఎల్లో’ సినిమా సెప్టెంబర్ 1న కన్నడంలో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ మూవీని తెలుగులో ‘సప్తసాగరాలు దాటి సైడ్ ఏ’ టైటిల్ తో అనువదించి, విడుదల చేయగా ఇక్కడ కూడా హిట్ గా నిలిచింది.
ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘సప్తసాగరాలు దాటి సైడ్ బి’ ని కన్నడ మరియు తెలుగులో ఒకేసారి విడదల చేశారు. ఈ మూవీ కోసం చిత్ర యూనిట్ తెలుగులో కూడా ప్రమోషన్స్ భాగా చేశారు. అయితే అయితే తొలి పార్ట్ కి వచ్చిన రెస్పాన్స్ రెండో పార్ట్ కి రావడం లేదని తెలుస్తోంది.
రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ నటించిన ‘సప్తసాగరాలు దాటి సైడ్ బి’ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో విడుదల చేసింది. కానీ సప్తసాగరాలు దాటి సైడ్ ఏకి వచ్చిన రెస్పాన్స్ సైడ్ బికి రావడం లేదు. ఈ చిత్రానికి పోటీగా పాయల్ రాజ్ పూత్ నటించిన మంగళవారం సినిమా రిలీజ్ అయ్యింది. ఆ మూవీ కూడా చిన్న సినిమానే.
సప్తసాగరాలు దాటి సైడ్-ఏ తెలుగులో విజయం సాధించడంతో ఈ మూవీ సీక్వెల్ కి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయని మేకర్స్ భావించారు. కానీ పరిస్థితి అలా కనిపించడంలేదని తెలుస్తోంది. రిలీజ్ కు ముందు చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా చేశారు. కాని ఆడియెన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారని అంటున్నారు. అయితే ఈ సినిమాకి ఎలాంటి నెగిటివ్ రివ్యూలు కూడా రాలేదు. మూవీ చూసిన ఆడియెన్స్ బాగుందని చెబుతున్నారు. అయితే మొదటి పార్ట్ తో పోల్చుకుంటే రెండవ పార్ట్ అంత ఎఫక్టివ్ గా లేదని టాక్.
సైడ్-ఏ మూవీలో ఎమోషనల్ సీన్స్ మనసులను కదిలించేలా ఉన్నాయని, సీక్వెల్ లో సైతం ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, రివేంజ్ డ్రామా కలపడం వల్ల అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందువల్లే ఆడియెన్స్ నుండి అంతగా రెస్పాన్స్ రావట్లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాకి ఒటీటీలో తప్పకుండా ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని అంచనాలు వేస్తున్నారు.
Ads
Also Read: ఈ 7 మంది డైరెక్టర్లకి ఈ 7 మంది హీరోయిన్లు చాలా ఫేవరెట్…వారి కాంబినేషన్ లో అన్ని హిట్లే.!