గొడుగులు ఎక్కువగా నల్ల రంగులో ఉండడం వెనుక రీసన్ మీకు తెలుసా?

Ads

అంబ్రెల్లా అనే పదం అంబ్రా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం నీడ లేదా షేడ్ అని వస్తుంది కాబట్టి ఎండ నుంచి వాన నుంచి సంరక్షించేదిగా అంబ్రెల్లా గుర్తింపు పొందింది. నిజానికి ఈ గొడుగు అనే వస్తువు నాలుగు వేల సంవత్సరాల క్రితమే కనుగొనడం జరిగింది. మన పురాణాల ప్రకారం విష్ణు అవతారమైన వామనుడు ఎప్పుడో ఈ గొడుగును వాడాడు. అయితే అప్పుడు వాడిని గొడుగులు ఇప్పుడు మనం వాడే గొడుగులు మధ్య ఎంతో వెత్త్యాసం ఉంది.

అయితే సహజంగా మనం చూసే గొడుగులు ఎక్కువ శాతం నలుపు రంగులో ఉంటాయి. ఇలా ఉండడానికి ప్రత్యేకమైన ఒక కారణం కూడా ఉంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత మార్కెట్లో పలు రకాల రంగులు మరియు డిజైన్స్ లో గొడుగులు అందుబాటులో ఉన్నాయి. నిజానికి గొడుగును నలుపు రంగులో తయారు చేయడానికి వెనుక కారణం ఏమిటి అనేది ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా మీకు ఈ విషయం పై అనుమానం వచ్చిందా?

Ads

పూర్వం రోజుల్లో గొడుగులు ఎక్కువగా నలుపు రంగు లో తయారు చేయడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది బ్లాక్ కలర్ ఎక్కువగా క్లాసిక్ కలర్ గా గుర్తించడం. ఎటువంటి దుస్తులు ధరించిన నలుపు రంగు గొడుగు సులభంగా మ్యాచ్ అవుతుంది. పైగా నల్ల రంగుకు అంత సులువుగా దుమ్ము ,ధూళి ,మరకలు వంటివి అంటవు. అందుకని ఈ రంగు గొడుగులను వాడడానికి అప్పట్లో ఎక్కువ ఇష్టపడేవారు. ఎందుకంటే అప్పట్లో ఒక వస్తువు తీసుకుంటే దాని ఎంతో పదిలంగా ఎక్కువ రోజులు వాడడానికే ప్రాముఖ్యత ఇచ్చేవారు.

పైగా మిగిలిన రంగులతో పోలిస్తే ఇది సూర్యుడు కాంతిని ,వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది అలాగే వర్షంలో తడిచిన త్వరగా ఆరిపోతుంది. లేత రంగు కలిగిన పురుగులు వాడడం వల్ల హీట్ రేడియేషన్ రిఫ్లక్ట్ అయ్యి కిరణాలు పక్కకు తప్పుకొని గొడుగు కిందకు వస్తాయి. అదే నల్ల గొడుగు వాడితే ఉష్ణోగ్రత లోపల ఉన్న వ్యక్తిని తాకాదు. అందుకే అప్పట్లో ఎక్కువగా నలుపు రంగు గొడుగులకు ప్రాధాన్యత ఇచ్చేవారు.

 

Previous articleచాణక్య నీతి: స్త్రీలు ఈ 5 విషయాలలో… పురుషుల కంటే ముందు ఉంటారు..!
Next articleరెమ్యూనరేషన్ విషయంలో తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్న సితార