రెమ్యూనరేషన్ విషయంలో తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్న సితార

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు…టాలీవుడ్ లో ఎటువంటి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. మహేష్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఎందరో ఉన్నారు కానీ మహేష్ బాబు లాగా సినిమాలతో పాటు ప్రకటనల ద్వారా అంతకుమించి సంపాదించేవారు మాత్రం వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

తెలుగులో టాప్ మోస్ట్ బ్రాండ్ ప్రకటనలకు చాలావరకు మహేష్ బాబు ని చూస్తుంటాం. అలాంటి మహేష్ బాబు కూతురు సితార గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఆమె డాన్స్ చేస్తూ పెట్టే వీడియోలకు ఓ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇంస్టాగ్రామ్ లో సీతారకు సుమారు 1.2 మిలియన్ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటివరకు కేవలం పెట్టిన నా 642 పోస్టులకు ఇంతమంది ఫాన్స్ ఉన్నారు అంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చూడండి.

Ads

మరి ఈ చిట్టి పాప నటించిన సరికొత్త యాడ్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం జరిగింది. ఇప్పటికే మహేష్ బాబుతో కలిసి సితార పలు టీవీ సీరియల్ కు సంబంధించిన ప్రమోషన్ యాడ్స్ లో కనిపించింది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి మొదటి కమర్షియల్ యాడ్ అయినప్పటికీ సితారకు భారీ రెమ్యునరేషన్ ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది.

జువెలరీ కి సంబంధించిన ఈ యాడ్ కోసం సితార తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనేది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. 12 సంవత్సరాల సితార ఈ యాడ్ కోసం అందుకున్న రెమ్యూనరేషన్ సుమారు కోటి రూపాయలని తెలుస్తోంది. మొదటి ఆడ్ తోటే సంచలనం సృష్టించిన సితార భవిష్యత్తులో మరిన్ని ప్రకటనలో కనిపించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల అభిప్రాయం.

Previous articleగొడుగులు ఎక్కువగా నల్ల రంగులో ఉండడం వెనుక రీసన్ మీకు తెలుసా?
Next articleకాంగ్రెస్ కి ప్రజల్లో పెరుగుతున్న మద్దతు ! BRS పార్టీ నేతలు వక్రీకరించారా ?