తెలీని వ్యక్తితో పెళ్ళి… జీవితం ఎలా ఉంటుందో అర్ధమైపోయింది… ప్రతీ అమ్మాయి లైఫ్ లో ఇంతే.. కొత్తగా ఏమి జరగలేదు..!

Ads

పెళ్లి తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి జీవితం కూడా మారిపోతుంది. అలవాట్లు వస్త్రధారణ ఇలా ప్రతి దానిలో కూడా మార్పు వస్తుంది. పుట్టింట్లో ఉన్నట్లు అత్తింట్లో ఉండడం కుదరదు. ఒక తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం… తెలియని కుటుంబానికి వెళ్లడం ఇదంతా కూడా ప్రతి ఆడపిల్లకి కష్టమే. అందులోనూ అర్థం చేసుకోలేని భర్త వస్తే ఇక జీవితాంతం నరకమే.

కాలేజ్ అయ్యి ఇంటికి వచ్చాను. తల దించుకుని లోపల కి వెళ్ళిపోయాను. బయట ఏమో ఎవరో తెలియని వాళ్ళు కూర్చున్నారు.

ఇంతలో అమ్మ లోపలికి వచ్చి నీకు పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక నాకు ఆప్షన్ కూడా లేదు. నాకేం పెద్దగా కలలు లేవు. డిగ్రీ పూర్తి చేసేసి చిన్న స్కూల్లో టీచర్ కింద పని చేసి కొంత సంపాదించుకుని తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇంతటితో ఆ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. నేనేమనుకున్నాను అనేది ఎవరికి ముఖ్యం కాదు అని నాకు ఆ రోజే తెలిసిపోయింది. ఇంతలో పెళ్లి చూపులు అయిపోయాయి అమ్మాయి నచ్చిందని చెప్పేసారు. పెళ్లి కుదిరిపోయింది పెళ్ళికి ఇంకా మూడు నెలలు టైం ఉంది. అయినప్పటికీ మూడుసార్లు కూడా నాకు కాబోయే భర్త నాతో మాట్లాడలేదు.

Ads

మాట్లాడదామని నేను అనుకుంటే నాకే భయం వేసింది. పెళ్లి ఇంకా వారం రోజులు ఉందనగా ఫోన్ వచ్చింది. పెళ్లి తర్వాత చీరలే కట్టుకోవాలి… డ్రెస్సులు వేసుకోకూడదు.. చదువుకోవాలి ఉద్యోగం చేయాలన్న కోరికలు ఉంటే మనసు నుంచి తీసేయ్ అని చెప్పి అతను ఫోన్ పెట్టేసాడు. పెళ్లి తర్వాత నా స్నేహితులు ఎంత బాధ పడ్డారో నాకు ఇప్పుడు అర్థమైంది ఇక పెళ్లి రోజు వచ్చేసింది. ఇల్లంతా హడావిడి నాతో ఇప్పటివరకు మాట్లాడలేని ఆ వ్యక్తితో పెళ్లి ఏంటి అని బాధపడ్డాను.

జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోయాను పైగా నన్ను అర్థం చేసుకోకుండా షరతులు విధించే వ్యక్తితో నేను ఎలా సంతోషంగా ఉంటాను..? ఒక్కసారిగా నన్ను ఇష్టపడిన వ్యక్తి గుర్తొచ్చాడు. నన్ను ఎంతో బాగా అర్థం చేసుకున్నాడు. కానీ నేనే రిజెక్ట్ చేశాను. ఉద్యోగం చేయిస్తానని కూడా చెప్పాడు. కానీ ఇంకేముంది ముహూర్తం సమయం అయింది. తలవంచుకుని తాళి కట్టించుకున్నాను. అమ్మా నాన్నని బాధ పెట్టలేకపోయాను. పెళ్లి జరిగింది. ఇంక అంతే కొత్త జీవితం మొదలవుతుంది. చెప్పడానికి ఏమీ లేదు. ప్రతి అమ్మాయి లైఫ్ లో జరిగే స్టోరీ ఏ ఇది.

Previous article“పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు..!
Next articleపెళ్లయ్యాక ఆడవారు అత్తమామలతో కలిసి ఉండడానికి ఎందుకు ఇష్టపడట్లేదు..? కారణాలు ఇవేనా..?