అరుంధతి సినిమాలో నటించిన ఈ బాలనటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Ads

హీరోయిన్ అనుష్క కెరీర్ లో మరచిపోలేని సినిమా అరుంధతి. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ డైరెక్షన్ చేశారు. సోనూ సూద్ ఈ చిత్రంలో విలన్ గా నటించి, మెప్పించాడు.

Ads

అనుష్క సినీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అరుంధతి అని చెప్పవచ్చు. ఇక చిత్రం ద్వారానే అనుష్క లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో అనుష్కకి మాత్రమే కాకుండా ఈ చిత్రంలో నటించిన నటినటులందరికి కూడా విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి.
ఈ సినిమాలో అనుష్క చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించిన బాల నటికి కూడా చాలా గుర్తింపు వచ్చింది. అరుంధతి చిన్నప్పటి పాత్రలో నటించిన బాలనాటి పేరు దివ్య నగేష్. ఆమె రాజసం ఉట్టిపడేట్టుగా దివ్య నగేష్ తన నటనతో అందరిని మెప్పించింది. అయితే ఈ బాలనాటి ప్రస్తుతం పెద్దగా అయ్యి హీరోయిన్ గా సినిమాలలో చేస్తోంది. వాస్తవానికి ఆమె తెలుగమ్మాయి కాదు. దివ్య నగేష్ ది కేరళ. అక్కడ ఆమె అప్పటికే నూతయాబైకి పైగా యాడ్ లలో చేసి, మంచి గుర్తింపు సంపాదించుకుంది.
దివ్య నగేష్ మలయాళ సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలలో నటించింది. అయితే ప్రస్తుతం ఎక్కువగా కోలీవుడ్ లో అవకాశాలను పొందుతున్నట్లుగా తెలుస్తోంది. దివ్య నగేష్ టాలీవుడ్ లో అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల దివ్య నగేష్ పాల్గొన్న ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వాటిని చూసిన నెటిజన్స్ దివ్య నగేష్ గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధమేనని సిగ్నల్ ఇస్తోందని అనుకుంటున్నారు. మరి దివ్య నగేష్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా వస్తుందో లేదో చూడాలి.

Also Read: SHIVA VEDHA REVIEW : ”శివ వేద” సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్…!

Previous articleటాలీవుడ్ లో త్రిపాత్రాభినయం చేసిన 9 మంది హీరోలు వీరే..
Next articleఎన్టీ రామారావు, తారకరత్న మరణాలకు మధ్య ఉన్న పోలిక ఏమిటో తెలుసా..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.