Ads
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ రాజమౌళి. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఒకదానిని మించి మరొకటి అన్నట్టుగా ఉంటాయి. ఆయన సినిమాలు విజువల్ వండర్స్ అని చెప్పవచ్చు. బాహుబలి మూవీతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.
Ads
తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఆ సినిమా తరువాత ఆయన దారిలోనే పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. గత ఏడాది వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయంగా తెలుగు సినిమా సత్తా చాటి చెప్పాడు. ఆ సినిమాకి ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రతిష్టాత్మకంగా భావించే న్యూయార్క్ క్రిటిక్స్ అవార్డ్ లు వచ్చాయి. అంతేకాకుండా ఆస్కార్ అవార్డ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయ్యింది.
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్టర్ మాత్రమే కాదు. ఆయనలో నటుడు కూడా ఉన్నాడు. అయితే ఆయన కొన్ని సినిమాలలో గెస్ట్ పాత్రలలో నటించాడు. అది అందరికి తెలిసిందే. కానీ ఆయన చిన్నతనంలోనే నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. రాజమౌళి ఒక చిత్రంలో బాల నటుడిగా నటించారు. ఆ చిత్ర పేరు పిల్లనగ్రోవి. అయితే ఆ మూవీ షూటింగ్ 1983లో జరిగింది.
ఇక పిల్లనగ్రోవి చిత్రం సమయంలో జక్కన్న వయసు 10 ఏళ్లు. అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినా, కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా రిలీజ్ కాకపోవడం వల్లనే రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం ఎక్కువమందికి తెలియదు. అయితే ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి చెప్పడం విశేషం.’ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తాను నటించిన మూవీ గురించి బయటపెట్టాడు. ఆ మూవీ రిలీజ్ కాకపోవడంతో మళ్లీ నటన వైపుకు వెళ్లలేదని తెలిపారు.రాజమౌళి 1973లో అక్టోబర్ 10న జన్మించారు. ఆయన పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. సినిమాలకు దర్శకుడిగా కాకముందు, రాజమౌళి టీవీ సీరియల్స్‌కు డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెం 1 మూవీతో దర్శకుడిగా మారాడు. దాదాపు ఇరవై ఏళ్ల కెరీర్ లో 12 సినిమాలు చేసిన రాజమౌళి, ఏ డైరెక్టర్ అందుకోలేని రికార్డ్స్ నమోదు చేశారు. బాహుబలి 2 రిలీజ్ అయ్యి ఐదేళ్లు అయినా ఇప్పటివరకు ఆ సినిమా కలెక్షన్స్ బీట్ చేసే మూవీ రాలేదు. స్టూడెంట్ నెం.1 సినిమా నుండి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ఆయన తీసిన సినిమాలన్నీ విజయం సాధించాయి.
Also Read: యూట్యూబ్ నుండి వెండితెరకు వచ్చి సక్సెస్ అయిన 8 మంది యూట్యూబర్లు