యూట్యూబ్‌ నుండి వెండితెరకు వచ్చి సక్సెస్ అయిన 8 మంది యూట్యూబర్లు

Ads

ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్స్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి షార్ట్‌కట్ లా మారింది. అందువల్ల షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నటీనటులు, దర్శకులు, రచయితలు యూట్యూబ్‌లో నిరూపించుకుని,మంచి గుర్తింపు పొంది, సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.

అలా షార్ట్ ఫిల్మ్స్ లో గుర్తింపు తెచ్చుకొని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ బ్రేక్ కోసం ఎదురుచూసే నటులు ఉన్నారు. అలాంటి వారికి ప్రధాన పాత్రలు వచ్చినపుడు తమ సత్తా చాటి,హిట్ అయ్యిన టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. మరి అలాంటి కొందరు హీరోలు, హీరోయిన్లు కాకముందు సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేసిన రానటువంటి గుర్తింపు, లీడ్ రోల్స్ చేసినపుడు వచ్చింది. మరి అలాంటి నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1.రాజ్ తరుణ్-ఉయ్యాల జంపాల:
యూట్యూబ్ లో అప్పడప్పుడే షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ అవుతున్న సమయంలో అప్పటికే ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రాజ్ తరుణ్ కి ‘ఉయ్యాల జంపాల’ సినిమా మంచి గుర్తింపును ఇచ్చింది. ఆ తరువాత నుండి వరుసగా సినిమాలు చేస్తున్నాడు.2.విశ్వక్ సేన్-వెళ్లిపోమాకే & ఈ నగరానికి ఏమైంది:
నిబంధనలు & షరతులు, పిట్ట కథ వంటి కవర్ సాంగ్స్ తో యూట్యూబ్ లో ప్రయోగాలు చేస్తున్న విశ్వక్ సేన్ కి బ్రేక్ వచ్చింది మాత్రం వెళ్లిపోమాకే. ఆ తరువాత ఫలక్‌నుమా దాస్,ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలు చేసాడు.
3.రీతూ వర్మ-పెళ్లి చూపులు:
షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన రీతూ వర్మ శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్షా సినిమాలో కాజల్ సిస్టర్ గా చేసింది. అప్పటిదాకా రాణి బ్రేక్ పెళ్లి చూపులులో చిత్రగా నటించింది. హీరోయిన్ గా మొదటి సినిమా హిట్ అయ్యింది.ఆ తరువాత తెలుగుతో పాటు తమిళం,మలయాళంలో ను నటిస్తోంది.4.నవీన్ పోలిశెట్టి-ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ:
ఈ హీరో ఈ సినిమా కంటే ముందుగా షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ, మరో వైపు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాడు. వాటితో రాని బ్రేక్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ లో హీరోగా చేసినపుడు వచ్చింది. ఆ తరువాత జాతి రత్నాలు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం హీరోయిన్ అనుష్క శెట్టితో ఒక చిత్రంలో నటిస్తున్నాడు.
5.ప్రియాంక జవాల్కర్-టాక్సీవాలా:
పొసెసివ్‌నెస్ వంటి హిట్ అయిన షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన ప్రియాంక, ఎన్నో ఎదరుచూపుల తరువాత టాక్సీవాలా సినిమాలో విజయ్ దేవరకొండకు హీరోయిన్ గా నటించి, హిట్ కొట్టింది. ఆ సినిమా తరువాత ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాలో నటించింది.
6.సుహాస్-కలర్ ఫోటో :
షార్ట్ ఫిల్మ్స్ తో టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా సుహాస్ నిరూపించుకున్నాడు. అయితే సినిమాల్లో మాత్రం ఆయనకు సైడ్ రోల్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక కలర్ ఫోటో సినిమాలో ప్రధానపాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నాడు. తాజాగా రైటర్‌ పద్శభూషణ్‌ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.7.చాందిని చౌదరి-మను & కలర్ ఫోటో:
మధురం లాంటి హిట్ షార్ట్ ఫిల్మ్ తో చాందిని గుర్తింపు తెచ్చుకుంది. ఇక మను, కలర్ ఫోటో సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తుంది.

Ads

8. జైత్రి మకానా-పెళ్లి కూతురు పార్టీ:
జైత్రి మకానా చాలా షార్ట్ ఫిల్మ్ మరియు వెబ్ సిరీస్ లో నటించింది.  పెళ్లికూతురు పార్టీ వంటి సినిమా చేసింది. ప్రస్తుతం రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం చిత్రంలో  కథానాయికగా నటిస్తోంది.

Also Read: టాలీవుడ్ స్టార్ హీరోలకి యాక్టింగ్ నేర్పిన గురువు గురించి తెలుసా?

Previous articleరైల్వే సీట్స్ లో “A” అని ఎందుకు ఉంటుంది.. దాని అర్ధం ఏమిటో తెలుసా..?
Next articleతెలుగు సినిమాలలో రీమిక్స్ చేసిన 20 సాంగ్స్..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.