ఏంటి “కాంప్లాన్” యాడ్ లో నటించిన చిన్నారులు…ఇప్పటి ఈ స్టార్ హీరో హీరోయిన్లా.?

Ads

మామూలుగా మనం టీవీలు చూస్తున్నప్పుడు అలాగే పేపర్ చదువుతున్నప్పుడు బయట ప్రదేశంలో అనేక రకాల యాడ్స్ కి సంబంధించిన పోస్టర్లు చూస్తూనే ఉంటాం. వారి వారి ప్రోడక్ట్లను మార్కెట్లో విడుదల చేయడం కోసం సెలబ్రిటీలతో చిన్నచిన్న పిల్లలతో కలిసి ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ప్రకటనలు సెలబ్రిటీలతోనే చేయిస్తూ ఉంటారు. అలా మనకు ఒక సినిమా చూస్తున్నప్పుడు గానీ ఏదైనా సీరియల్స్ చూస్తున్నప్పుడు గానీ ఈ మధ్యలో ప్రకటనలు రావడం అన్నది సహజం. అలా యాడ్స్ మధ్యలో కొన్ని కొన్ని వాటిలో పాటలు కూడా పాడేవారు.

అలాంటి పాటల్లో వాషింగ్ పౌడర్ నిర్మా, ఐ లవ్ యూ రస్నా, బూంబూం బూమర్, ఇల్లంతా మిల మిల మెరవాలంటే.. నోరోలాక్స్, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది, వికో టర్మరీ కాదు కాస్మటిక్, ఊ లాలాలా అంటూ లిరిల్ యాడ్, సంతూర్ సంతూర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అటువంటి వాటిల్లో మరొకటి నేను ఎదుగుతున్నాగా మమ్మీ అంటూ కాంప్లెన్ యాడ్ వస్తూ ఉండేది. ఐ యామ్ కాంప్లన్ గర్ల్, కాంప్లన్ బాయ్ అందులో ఇద్దరు చిన్నారులు నటించారు. ప్రస్తుతం మనకు పైన కనిపిస్తున్న ఫోటో ఆ యాడ్ లోనిదే. ఈ యాడ్ వచ్చి కూడా చాలా ఏళ్లు అవుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో అసలు ఈ యాడ్ ఎక్కడా మనకు కనిపించడం లేదు.

Ads

అయితే ఆ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు ఎవరు? చిన్నారులు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆ కిడ్స్ ఇద్దరు ఇప్పుడు స్టార్స్ అయ్యారు. ఆ ఇద్దరు బాలీవుడ్ నటులు షాహీద్ కపూర్, అయేషా టకియా. షాహీద్ కపూర్ ఇంకా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే అయేషా టకియా మాత్రం ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. బాలీవుడ్ సినిమాలు చూసే వారికి షాహీద్ కపూర్ సుపరిచితమే.

పలు యాడ్స్ ద్వారా కూడా తెలుగు వారికి దగ్గరయ్యాడు. కబీర్ సింగ్, జెర్సీ తెలుగు సినిమా రీమేక్స్‌లో హీరోగా నటించి మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. ఇక అయేషా టకియా తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ చిత్రంలో నాగార్జునకు జోడిగా కనిపించింది. హిందీలో పలు సినిమాల్లో కనిపించింది.

Previous articleబాలనటుడుగా నటించిన రాజ‌మౌళి.. ఆ సినిమా ఏమిటో తెలుసా?
Next articleహోలీ సందర్భంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.! చూసి ఎంజాయ్ చేయండి.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.