Ads
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మ్యాచ్ అంటే…అందులోనూ వరల్డ్ కప్ అంటే రష్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అనుకుంటున్నారా…ఊహించిన దానికి విరుద్ధంగా వెలవెలబోతున్న స్టేడియం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఇలా ఆదరణ లేకుండా ఉండడం ఏమిటి అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ మ్యాచ్ కోసం బీసీసీఐ ఎటువంటి ప్రారంభ వేడుకలను నిర్వహించకపోవడం మరింత విడ్డూరంగా ఉంది. పైగా ఇది లాస్ట్ వరల్డ్ కప్ ఫైనలిస్ట్ టీమ్స్ అయిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న కీలకమైన మ్యాచ్.. మరి అలాంటి మ్యాచ్ అంటే సన్నాహాలు అల్లాటప్పగా ఉండకూడదు కదా. అయితే ప్రస్తుతం ఈ చారిత్రాత్మకమైన మ్యాచ్ కి వేదిక జనాలు లేక ఉసూరు మంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఖాళీ స్టేడియం ఫోటోలు చూసి నేటిజెన్లు పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు.
Ads
అంతటితో ఆగకుండా హాష్ టాగ్ నరేంద్ర మోడీ స్టేడియం అంటూ ఈ ఎంప్టీ స్టేడియం ను ట్విట్టర్ లో ట్రెండ్ గా మార్చారు. ప్రపంచ కప్ తొలి మ్యాచ్ కు ఇలా ఉంటే రాబోయే మ్యాచ్ ల పరిస్థితి ఏమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంతకుముందు జరిగిన అవమానానికి న్యూజిలాండ్ ..ఇంగ్లాండ్ పై తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. 9 వికెట్ల భారీ తేడాతో 36.2 ఓవర్లలో నిర్ణీత 282 స్కోర్ ను సునాయాసంగా చేదించి తొలి మ్యాచ్ లో విజయ బావుటా ఎగురవేసింది. రచిత్ రవిచంద్ర 82 బంతులను ఎదుర్కొని బీభత్సకరమైన ఎదురు దాడి చేసి 111 పరుగులు రాబట్టి టీం విజయానికి తన వంతు కృషి చేశాడు. డేవన్ కాన్వే చేసిన మెరుపు సెంచరీ కూడా జత కావడంతో వీళ్ళిద్దరూ న్యూజిలాండ్ ను గెలుపు వైపు నడిపించారు.