SIDDHARTH CHINNA REVIEW : “చిన్నా” సినిమాతో “సిద్ధార్థ్” తెలుగులో కంబ్యాక్ ఇవ్వగలిగారా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

ఇప్పుడు జనరేషన్ వాళ్లకు సిద్ధార్థ పెద్దగా తెలియకపోవచ్చు కానీ 90స్ వాళ్లకు మంచి లవర్ బాయ్ గా సిద్ధార్థ బాగా తెలుసు. అయితే గత కొద్ది కాలంగా మంచి సాలిడ్ హిట్టు కోసం ఎదురుచూస్తున్న సిద్ధార్థ చిన్నా అనే మూవీతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ చేయబడింది. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం..

చిత్రం : చిన్నా
నటీనటులు : సిద్ధార్థ్, నిమిషా సజయన్, అంజలీ నాయర్
నిర్మాత : సిద్ధార్థ్
దర్శకత్వం : ఎస్.యు.అరుణ్ కుమార్
సంగీతం : ధిబు నినాన్ థామస్
విడుదల తేదీ : అక్టోబర్ 6, 2023

స్టోరీ :

ఈశ్వర్ (సిద్ధార్థ్) పురపాలక శాఖలో ఉద్యోగం చేస్తుంటాడు. అతని అన్న చనిపోయిన తర్వాత వదిన (అంజలి నాయర్), అన్నయ్య కూతురు చిట్టి (సహజ శ్రీ) బాధ్యతలు తీసుకున్న ఈశ్వర్ చిట్టిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. చిట్టి కూడా ఈశ్వర్ ను ముద్దుగా చిన్నా అని పిలుస్తూ ఉంటుంది. అయితే చిన్నపిల్లలను ఎంతో ఇష్టపడే ఈశ్వర్ పై అనుకోకుండా ఓ అపవాదు పడుతుంది. ఆ నిందతో బాధపడుతున్న ఈశ్వర్ .. చిట్టి కనిపించకుండా పోవడంతో మరింత ఆందోళనకు గురి అవుతాడు. అసలు చిట్టి ఎక్కడికి వెళ్ళింది? ఈశ్వర్ మీద పడ్డ నింద ఏమిటి? చివరికి ఈశ్వర్ తన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు ? తెలియాలి అంటే సినిమా చూడాల్సింది..

రివ్యూ :

ఒకప్పుడు మంచి సక్సెస్ అందుకున్న సిద్ధార్థ గత కొద్ది కాలంగా నిర్విరామంగా మంచి సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న తిరిగి మహాసముద్రం మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన అంతగా ఆకట్టుకోలేక పోయాడు. అయితే వినూత్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిన్నా మూవీలో అతని లుక్ ఎంతో డిఫరెంట్ గా ఉంది.

Ads

కథ ఎంతో డిఫరెంట్ గా ఆలోచింప చేసే విధంగా ఉంది. ఈ మూవీ కాన్సెప్ట్ బాగా నచ్చడంతో సొంతగా ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా …అన్ని భాషలలో తనకు సంబంధించిన డబ్బింగ్ కూడా సిద్ధార్థ చెప్పడం సినిమా పట్ల అతనికి ఉన్న ప్రేమకు నిదర్శనం. ఈ మూవీలో సిద్ధార్థ ఎంతో సహజంగా ఎటువంటి మేకప్ లేకుండా, ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడిగా అందరినీ ఆకర్షిస్తాడు. సినిమా చూస్తున్నంత సేపు ఒక ఫీల్ ను మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఈ మూవీలో ప్రతి ఎమోషన్ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది.

నిజానికి సినిమా మొత్తం సిద్ధార్థ వన్ మ్యాన్ షో చేశాడు. మరీ ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అతని పర్ఫామెన్స్ ద బెస్ట్ అని చెప్పవచ్చు. చిట్టి పాత్రలో నటించిన పాప ఎంతో అద్భుతమైన నటన కనబరిచింది. కాకపోతే సినిమా లో అసలు కథ మొదలు పెట్టడానికి చాలా ఎక్కువ టైమే తీసుకున్నారు. ఈశ్వర్ కు ..అతని అన్న కూతురికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో చూపించాలి అనే తపనతో ఆ సీన్స్ ను మరీ సాగదీసినట్లుగా చేశారు.

ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను బాగా హైలైట్ చేస్తూ సినిమా ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చారు. పిల్లలకు ఎక్కువ ఫోన్ అలవాటు చేయడం వల్ల…ఎటువంటి ప్రమాదాలు జరగవచ్చు అనే విషయాన్ని ఒక కొత్త కోణంలో చూపించారు. కాకపోతే చూపించడం చాలా స్లోగా బోర్ కొట్టేలా చూపించారు.

ప్లస్ పాయింట్స్ :

  • సిద్ధార్థ్ యాక్షన్ ఎంతో నాచురల్ గా ఉంది.
  • దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది.
  • నిర్మాణ విలువలు బాగా పాటించారు.
  • సినిమాలో అందించిన మెసేజ్ ప్రస్తుతం జనరేషన్ కి ఎంతో ముఖ్యమైనది.

మైనస్ పాయింట్స్:

  • సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్ కారణంగా సినిమాలో అసలు పాయింట్ ఆఫ్ వ్యూ మొదలవ్వడానికి చాలా సమయం పట్టింది.
  • ఎడిటింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరింత బాగుండే.

రేటింగ్ : 3/5

ట్యాగ్ లైన్ :

కాస్త లెంగ్తీ గా ఉన్న ఇబ్బంది లేదు.. మెలో డ్రామా ఆర్ట్ మూవీ రేంజ్ లో ఉన్న సినిమా అయినా ఎంజాయ్ చేస్తాం అనుకునే వారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. సహజత్వం ఉట్టిపడే చిత్రాలు చూడాలి అనుకునే ప్రేక్షకులకు కూడా ఈ మూవీ నచ్చుతుంది. కథ కొద్ది కాలంలో వచ్చిన ఒక మంచి ప్రయోగాత్మక చిత్రం చిన్నా.

Previous articleఇది వరల్డ్ కప్ మ్యాచేనా.? మొదటి మ్యాచ్ పరిస్థితే ఇలా అయితే ఎలా.? అది కూడా మోదీ స్టేడియంలో.?
Next articleనా భార్య రెండో పెళ్లి చేసుకుంది అని కేసు వేసాడు…చివరికి కోర్టు అతనికే షాక్ ఇచ్చింది..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.