“ఇలాంటి అమ్మాయి భార్యగా రావాలి దేవుడా!!”…ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.?

Ads

సాయి పల్లవి న్యాచురల్​ బ్యూటీగా ఎంతో పేరు తెచ్చుకుంది. ఆమెతో మొదలైన ఈ ట్రెండ్​ టాలీవుడ్ లో రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం లిస్ట్ లో మరో హీరోయిన్ చేరిపోయింది. ఆమె నటనకి కుర్రాళ్ళు అందరు ఫిదా అయిపోయారు. రీసెంట్ గా కన్నడలో విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ అనే చిత్రాన్ని తెలుగులో “సప్త సాగరాలు దాటి” గా డబ్ చేసారు. థియేటర్స్ లో ఈ సినిమా మంచి రెస్పాన్స్ సాధించింది. తాజాగా ఓటిటిలో రిలీజ్ అయ్యాక ఈ సినిమా మరింత ప్రేక్షాదరణ పొందింది.

ఈ సినిమాలో ఆ కన్నడ బ్యూటీ హీరోయిన్ ​గా నటించింది. న్యాచురల్​ లుక్స్​కి తో యూత్ ను ఆకట్టుకున్న ఆమె గురించి వెతుకుతున్నారు. మరి ఆమె ఎవరో? ఇప్పుడు చూద్దాం..రుక్మిణీ న్యాచురల్​ లుక్స్​కి కన్నడ యువత ఫిదా అయ్యింది. ఈ మూవీ పోస్టర్స్​, పాటలు సోషల్​ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మూవీతో రుక్మిణీకి కన్నడ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలలో ​అవకాశాలు వచ్చాయి. రుక్మిణీ వసంత్ గురించి నెటిజెన్లు నెట్టింట్లో తెగ వెతుకుతున్నారు. రుక్మిణి వసంత్ 1994లో కర్ణాటకలోని బెంగళూరులో డిసెంబరు 10న జన్మించింది. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం అశోక చక్రను కర్నాటకలో పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు.

Ads

ఆమె బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత లండన్‌ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ లో పట్టా పొందింది. ఆ తరువాత కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, 2019లో బీర్బల్ ట్రైలాజీ కేసు 1′ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఈ ఏడాది రిలీజ్ అయిన సప్త సాగర దాచే ఎల్లో ఆమె రెండవ సినిమా. ఇక త్వరలో తెలుగు ఆడియెన్స్ ముందుకు రానుంది. ఆమె నటన, లుక్స్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటే తెలుగులో కూడా పాపులారిటీ వస్తుంది. మరి సప్త సాగరాలు దాటి మూవీతో రుక్మిణీ వసంత్​ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

Previous articleఏలినాటి శని అంటే అంటే.? దాని నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి.?
Next articleఇది వరల్డ్ కప్ మ్యాచేనా.? మొదటి మ్యాచ్ పరిస్థితే ఇలా అయితే ఎలా.? అది కూడా మోదీ స్టేడియంలో.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.