సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోయిన్స్ గా సక్సెస్ కానీ సెల‌బ్రిటీ డాట‌ర్స్‌

Ads

ఎంతో మంది సినిపరిశ్రమలోకి వచ్చి తమ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. అయితే చాలా మంది ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా కూడా తమ స్వ‌యం కృషితో ఎదిగారు. కొంద‌రు త‌మ సినీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, స్టార్లుగా మారిన వారు ఉన్నారు.

Ads

కానీ కొంతమంది మాత్రం సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా స్టార్లుగా మరలేకపోయారు. అలా వచ్చిన వారిలో హీరోలు చాలా వ‌ర‌కు స్టార్స్ గా అయ్యారు. అయితే సిని నేప‌థ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వ‌చ్చిన‌ కుమార్తెలు మాత్రం హీరోయిన్స్ గా రాణించలేకపోయారు. మరి అలా సినీ ఫ్యామిలీ నుండి వచ్చి హీరోయిన్స్ గా రాణించలేకపోయిన వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..సుప్రియ యార్లగడ్డ:
కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ. ఈమె నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరావు మనవ‌రాలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హీరోయిన్ గా తొలి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయింది. ఇక ఈ మూవీ అనంతరం సుప్రియకి హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. అప్పడప్పుడు సపోర్టింగ్ రోల్స్  లో కనిపిస్తుంది.
మంజుల ఘట్టమనేని:
మహేష్ బాబు చిన్నక్క, సూపర్ స్టార్ కృష్ణ సెకండ్ కూతురు మంజుల హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని అనుకుంది. బాలకృష్ణతో ఒక సినిమాలో హీరోయిన్ గా చేయాల్సి ఉండగా కృష్ణ అభిమానులు అడ్డుకున్నారు. కృష్ణగారి అమ్మాయి వేరేవాళ్ళ పక్కన హీరోయిన్ గా ఊహించుకోలేమని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నిరసన చేయడంతో అక్కడితో ఆగిపోయింది. అయితే మంజుల పలు సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ లో నటించింది.
అక్షర‌ హాసన్:
లోకనాయకుడు కమల్ హాసన్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో శృతి హాసన్ ఇప్పటికే స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. అయితే రెండవ కూతురు అక్షర‌ హాసన్ కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించినప్పటికి, ఆమె హీరోయిన్ గా రాణించలేకపోయింది. ప్ర‌స్తుతం ఆమె ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంది.
నిహారిక:
టాలీవుడ్ లో మెగా‌ ప్యామిలీకి ఉన్న క్రేజ్ కానీ, ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారికను మాత్రం ఆడియెన్స్ హీరోయిన్ గా అంగీకరించలేకపోయారు. నిహారిక ‘ఒక మనసు’ అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికి ఆమెని హీరోయిన్ గా ఆదరించలేకపోయారు.
మంచు లక్ష్మి :
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి హీరోయిన్‌గా పూర్తి స్థాయిలో నటించకపోయినా, ఆమె నటిగా మాత్రం కొనసాగుతోంది. అయినప్పటికీ ఎక్కువ చిత్రాలు  చేయలేకపోతోంది.వరలక్ష్మి శరత్ కుమార్:
తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి హీరోయిన్‌గా కొనసాగలనుకున్నా, కొన్ని చిత్రాలు చేసినా హీరోయిన్ గా రాణించలేకపోయింది. కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో విలన్ పాత్రలు, పవర్‌పుల్ పాత్రలు చేస్తోంది. క్రాక్ సినిమాలో నెగెటివ్ రోల్ లో రవితేజతో పోటీపడి నటించింది.
Also Read: టాలీవుడ్ లో సర్జరీ చేయించుకున్న10 మంది స్టార్ హీరోయిన్స్..

 

 

Previous articleరీమేక్ దండయాత్రలు దశ మార్చవు… చిరుకి అభిమాని లేఖ…
Next articleపెద్దా ,చిన్నా తేడా లేకుండా 2023 లో బ్రేక్ ఈవెన్ రికార్డ్ క్రాస్ చేసిన చిత్రాలు ఇవే…
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.